ఫ్లాప్ టాక్ రావాలని కోరుకుంటున్న హీరోలు

allu-ntr

అదేంటి సినిమా హిట్ అయితేనే కదా అందం… హీరోలకు ఆనందం కూడానూ. కానీ ఇప్పుడు హీరోలంతా రూటు మార్చారు. మాట కూడా మార్చారు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. అవసరమైతే ఫస్ట్ డే తామే ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేయాలని కూడా చూస్తున్నారు. అవును నిజమే… ఇప్పుడిదే ఓ సెంటిమెంట్ గా మారింది. రిలీజ్ రోజు ఫ్లాప్ టాక్ వస్తే సినిమా గ్యారెంటీ హిట్ అనే సెంటిమెంట్ ఇప్పుడు బాగా బలపడిపోయింది.

సరైనోడు వచ్చినప్పుడు అంతా ఫ్లాప్ అన్నారు. కానీ ఫైనల్ రన్ చూస్తే.. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా జనతా గ్యారేజ్ వచ్చింది. ఇది కూడా మొదటి రోజు మిక్స్ డ్ రిజల్టే తెచ్చుకుంది. కానీ కట్ చేస్తే… 3 వారాలు తిరిగేసరికి టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లోమూడో స్థానానికి చేరుకుంది. ఇప్పుడీ జాబితాలోకి మజ్ను కూడా చేరిపోయింది.

మజ్ను సినిమా విడుదలైన వెంటనే యావరేజ్ అన్నారు. మరికొందరు ఎబోవ్ యావరేజ్ అన్నారు. కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టు ఉన్నాయని అన్నారు. కానీ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు.. సినిమాను ఓసారి చూడొచ్చు… సరదాగా ఉందనే పైనల్ కన్ క్లూజన్ కు వచ్చేశారు. అలా నెగెటివ్ టాక్ తో స్టార్టయిన మజ్ను ఇప్పుడు హిట్ దిశగా దూసుకుపోతోంది.

Loading...

Leave a Reply

*