కుడి ఎడమైతే..

unnamed

ఇప్పటికే నాని కెరీర్ ఓ రేంజ్ లో పరుగులు పెడుతోంది. ఏ సినిమా చేస్తే అది హిట్ అవుతోంది. అలా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న ఈ నేచురల్ స్టార్.. తన కెరీర్ ను మరింత స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నేను లోకల్ అనే సినిమా చేస్తున్న ఈ యంగ్ స్టర్… మరోసారి అదే బ్యానర్ లో ఇంకో మూవీ చేసేందుకు డిసైడ్ అయ్యాడు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. ఎప్పట్నుంచో రాజుగారి వాకిట్లో తచ్చాడుతున్న మూవీ.

అవును… వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. మొదట ఇందులో హీరోగా రవితేజను అనుకున్నారు. సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల మాస్ రాజా తప్పుకోవడంతో… తర్వాత ఆ కథ నాగార్జున వద్దకు వెళ్లింది. కానీ ఎఁదుకో నాగార్జున కూడా సైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ కథ నాని చెంతకు చేరింది. ఈసారి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఈ మూవీతో పాటు కొత్త దర్శకుడితో మరో సినిమా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంకో సినిమాకు కూడా కమిట్ మెంట్స్ ఇచ్చాడట నేచురల్ స్టార్. ఇలా ఏడాదికి కనీసం 2 సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు.

Loading...

Leave a Reply

*