రాజమౌళి, కొరటాల… మూడో స్థానం సురేందర్ రెడ్డిదే…

raja

టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుల్లో నంబర్ వన్ స్థానం కచ్చితంగా రాజమౌళిదే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. కావాలంటే నంబర్-2 స్థానంలో కొరటాల లేదా త్రివిక్రమ్ మధ్య పోటీ పెట్టొచ్చు. పోటీలో ఒకరు నంబర్-2కు ఫిక్స్ అయిపోతే.. మరొకరు నెంబర్-3లో కొనసాగుతారు. అయితే ఆ నంబర్-3 పొజిషన్ మాత్రం తనదే అంటున్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పటివరకు చరిత్ర తిరగరాసే సినిమాలు చేయలేదు. అలాగనే తాజాగా పెద్ద హిట్ కూడా లేదు. కానీ డైరక్టర్లలో తనదే మూడో స్థానం అంటున్నాడు.

అయితే రెడ్డిగారి లెక్కలు వేరే ఉన్నాయి. దర్శకుల్లో పారితోషికం తీసుకునే విషయంలో తనది మూడో స్థానం అంటున్నాడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం పరిశ్రమలో రాజమౌళి మాత్రమే అత్యథిక పారితోషికం అందుకుంటున్నాడు. సెకెండ్ ప్లేస్ లో కొరటాల శివ, ధర్ట్ ప్లేస్ లో త్రివిక్రమ్ ఉన్నారు. వీళ్ల తర్వాతే పూరీ జగన్నాధ్, వీవీ వినాయక్ లాంటి దర్శకులు వస్తారు. అయితే ఈ లిస్ట్ లోకి సడెన్ గా ఎంటర్ అయ్యాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం చరణ్ తో ధృవ సినిమా చేస్తున్న చెర్రీ… ఊహించని ఆఫర్ అందుకున్నాడు. రాజమౌళి, కొరటాల తర్వాత అత్యథిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించబోతున్నాడు.

అవును.. ధృవ సినిమా తర్వాత తన కొడుకు నిఖిల్ తో ఓ సినిమా చేయమని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి… సురేందర్ రెడ్డికి ఆఫర్ ఇచ్చాడట. అదికూడా ఏకంగా 10కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడట. ఇప్పటివరకు ఇంత ఎమౌంట్ ను సురేందర్ రెడ్డి ఎప్పుడూ అందుకోలేదు. తాజా సమాచారం ప్రకారం… కుమార స్వామి, సురేందర్ రెడ్డి మధ్య డీల్ ఓకే అయిపోయినట్టు తెలుస్తోంది. ధృవ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి నిఖిల్ తోనే సెట్స్ పైకి వెళ్తాడని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*