వక్కంతం సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలిసింది…

untitled-111

జనతా గ్యారేజ్ తర్వాత లెక్కప్రకారం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలి. అది కూడా తన అన్న కల్యాణ్ రామ్ బ్యానర్ పై ఓ సినిమా చేయాలి. కానీ తారక్ మాత్రం రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. వక్కంతం సినిమాను ఓకే చేయలేదు. అటు వక్కంతంతో పాటు కథలు వినిపించిన పలువురు దర్శకుల్ని కూడా హోల్డ్ లో పెట్టాడు. అయితే వీళ్లలో వక్కంతంతో ఇక సినిమా ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఆ టాక్ నిజమే అంటున్నాడు కల్యాణ్ రామ్.

ఇజం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కల్యాణ్ రామ్, ఇప్పట్లో తన బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా సినిమా ఉండదని స్పష్టంచేశాడు. మరీ ముఖ్యంగా వక్కంతం దర్శకత్వంలో తారక్ హీరోగా ప్రాజెక్టు దాదాపు ఆగిపోయినట్టేనని ప్రకటించాడు. దీనికి కారణాన్ని కూడా కల్యాణ్ రామ్ వివరిస్తున్నాడు. కేవలం కథ నచ్చకపోవడంతోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వివరణ ఇచ్చాడు.

తను కష్ట కాలంలో ఉన్నప్పుడు టెంపర్ లాంటి కథను అందించిన రచయిత వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశమిచ్చి ఆయనతో సినిమా చేయాలని తారక్ అనుకున్నాడు. వంశీ కూడా తారక్ కోసం మాస్ ఎంటర్ టైనర్ కథ సిద్ధం చేశాడు. కానీ ఎన్టీఆర్ వంశీకి హ్యాండిచ్చి పూరి జగన్నాథ్ తో సినిమాకి రెడీ అయ్యాడు. అసలు ఇన్నిరోజులు సినిమా చేస్తానని తీరా సమయం వచ్చాక ఎన్టీఆర్ ఎందుకు వద్దనుకున్నాడు అనే సందేహాలు అందరిలో బయలుదేరాయి. ఎట్టకేలకు ఆ సందేహాలకు కల్యాణ్ రామ్ సమాధానం ఇచ్చాడు.

Loading...

Leave a Reply

*