అక్కచెల్లెళ్లు కాదు… తల్లీకూతుళ్లు…

ta

ఈ ఫొటో చూస్తే ఎవరైనా అక్కాచెల్లెళ్లు అనుకున్నారు. కానీ వీళ్లు తల్లీకూతుళ్లు. ఈ ఫొటోలో ఉన్నది తమన్న వాళ్ల అమ్మ. ప్రస్తుతం తను తన అమ్మలా ఉన్నానని చెప్పడం కోసం.. తమన్న ఇలా బ్లాక్ అండ్ వైట్ లో ముస్తాబై వచ్చింది. తమన్నా తల్లి యుక్త వయసులో ఉండగా తీయించుకున్న ఫోటో అది. అచ్చం అమ్మలాగే తయారై ఫోటోకు ఫోజిచ్చింది తమన్నా. ఆ రెండు ఫోటోలను కలిపి తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ‘మా అమ్మ చిన్నప్పటి లవ్లీ ఫోటో దొరికింది. నేను అచ్చం మా అమ్మకు ప్రతిబింబంలా ఉండడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. లవ్‌ యూ మామ్‌’ అని కామెంట్‌ కూడా రాసింది.

ప్రస్తుతం తమన్న టోటల్ ఇండియాలో లీగ్ లో ఉంది. తెలుగులో బాహుబలి-2, అభినేత్రి సినిమాల కోసం వెయిట్ చేస్తోంది. అటు హిందీలో కూడా బాహుబలి హిట్ అవ్వడం తమన్నాకు కలిసొచ్చింది. మరోవైపు తమిళనాట కూడా క్రేజీ ప్రాజెక్టులు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పీక్ టైంలో తమన్న ఈ ఫొటో విడుదల చేయడంతో… అందరి దృష్టి దీనిపై పడింది.

Loading...

Leave a Reply

*