మెగా స్ట్రాటజీతో ఆ ముగ్గురికీ టెన్షన్

allu

ఈమధ్య హీరోలంతా తమిళ మార్కెట్ పై ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. మురుగదాస్ సినిమాతో మహేష్ తమిళనాట హల్ చల్ చేయాలనుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా నెక్ట్స్ సినిమాను తమిళ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. కానీ వీళ్లందరికీ ఇప్పుడు కామన్ గా ఓ టెన్షన్ పట్టుకుంది. అదే అల్లు అరవింద్ మెగా ప్లానింగ్.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. చిరంజీవిని మెగాస్టార్ గా తీర్చిదిద్దడం వెనక అల్లు అరవింద్ బ్రెయిన్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ మెగా ప్రొడ్యూసర్, తన కొడుకు బన్నీ ప్యూచర్ పై ఫోకస్ పెట్టాడు. లింగుస్వామి దర్శకత్వంలో బన్నీని తమిళనాడుకు పరిచయం చేస్తున్నాడు.

ఇప్పటికే అల్లు అరవింద్ స్ట్రాటజీతో తెలుగు మార్కెట్లో హీరోలంతా లబోదిబోమంటున్నారు. కనీసం తమిళ్ లో అయినా తమను వదిలేస్తాడనుకున్న మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు ఇప్పుడు అక్కడ కూడా నిద్రలేకుండా చేస్తున్నాడు అల్లు అరవింద్. త్వరలోనే కోలీవుడ్ లో టాలీవుడ్ హీరోల వార్ షురూ కాబోతోంది. మరి ఈ పోరులో మెగా ప్రొడ్యూసర్ ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*