ఇద్దరు చంద్రుల మధ్య శాతకర్ణి హంగామా

untitled-40

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవం రోజు ఎంత హంగామా జరిగిందో మనందరం చూశాం. ఇప్పుడా హంగామా మొత్తాన్ని రిలీజ్ కు ముందు కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అవును.. శాతకర్ణి సినిమాకు పొలిటికల్ టచ్ ఇచ్చేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి చూడబోతున్నారట. ఆ తర్వాతే సినిమా థియేటర్లలోకి వస్తుందట.

ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో ఉంది. డిసెంబర్ చివరి వారానికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేరకు రెండు ముఖ్యమంత్రి కార్యాలయాలతో బాలయ్య వర్గీయులు సంప్రదింపులు జరుపుతున్నారు. అలా శాతకర్ణి సినిమాతో తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలవబోతున్నారు.

జనవరి 3న స్పెషల్ ప్రీమియర్ పూర్తయిన తర్వాత 10రోజుల గ్యాప్ లో జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సినిమాలో బాలయ్య సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది.

Loading...

Leave a Reply

*