అనుష్క కోసం టెక్నాలజీ వాడుతున్నారట

untitled-10

సినిమా కోసం హై-ఎండ్ టెక్నాలజీ వాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఓ హీరోయిన్ కోసం టెక్నాలజీ వాడ్డం ఏంటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. అనుష్క కోసమే ప్రత్యేకంగా ఓ టెక్నాలజీ వాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం వల్ల.. ఆ టెక్నాలజీ వచ్చి చేరింది. బాహుబలి నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడైంది.సైజ్ జీరో కోసం బాగా లావెక్కింది అనుష్క. మరోవైపు బాహుబలి పార్ట్-2 షూటింగ్ రెడీ అయిపోతోంది. తొందరగా తగ్గమంటే అనుష్క తగ్గలేకపోయింది. ఎంత యోగా బాడీ అయినా.. కొవ్వు పేరుకుపోతే తగ్గించడం చాలా కష్టమనే విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించింది. కానీ ఎంత ప్రయత్నించినా సైజ్ మాత్రం తగ్గించలేకపోయింది.

అలా అని అనుష్కను తీసి పక్కనపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఇది సీక్వెల్ మూవీ. అందుకే గత్యంతరం లేక టెక్నాలజీని నమ్ముకున్నారట మేకర్స్.ఫ్యాన్ సినిమాలో షారూక్ ను టీనేజర్ గా చూపించడానికి, ధోనీ సినిమాలో సుశాంత్ ను చిన్నోడిగా చూపించడానికి ఏ టెక్నాలజీని అయితే వాడారో.. సరిగ్గా అదే టెక్నాలజీతో అనుష్కను కూడా సినిమాలో సన్నగా చూపించారట. అంతేతప్ప అనుష్క మాత్రం ఒరిజినల్ గా ఏమాత్రం తగ్గలేదట. ఆమె బరువు తగ్గుతుందని వెయిట్ చేస్తూ కూర్చుంటే.. ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుందని గ్రహించి, అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారట.

Loading...

Leave a Reply

*