త్రివిక్రమ్ సెట్ అవ్వలేదు… మిగిలింది వాళ్లిద్దరే…

tri

జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత తారక్ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాడు. ఎలాంటి సినిమా చేయాలి, ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలి లాంటి ఈక్వేషన్స్ తో బిజీ అయిపోయాడు. అందుకే ఇప్పటివరకు సినిమా ఎనౌన్స్ చేయలేకపోయాడు. అయితే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని మాత్రం తారక్ కు బలంగా ఉండేది. అందుకే ఈమధ్య కొన్ని రోజులు త్రివిక్రమ్ కోసం ట్రైచేశాడు.

కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ కే ఫిక్స్ అయిపోయాడు. పవర్ స్టార్ తో మరో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సో… ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ పై ఆశలు వదులుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తారక్ చేతిలో ఉన్న ఆప్షన్లు రెండే. వాటిలో ఒకదానికి ఫిక్స్ అవ్వాలి.

పూరి జగన్నాధ్ ఇప్పటికే తారక్ కోసం ఓ కథ సిద్ధంచేశాడు. ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. లేదంటే పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకున్న కథకు ఓకే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దానికి ఓకే చెప్పి… సినిమా కంప్లీట్ అయిన వెంటనే… వచ్చే ఏడాది రాజమౌళితో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*