మరోసారి పండగ చేసుకున్న తారక్

untitled-8

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పండగ చేసుకున్నాడు. అతడు నటించిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడో రోజు నుంచే పార్టీలు షురూ చేశారు టోటల్ టీం అంతా. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇచ్చిన పార్టీతో మొదలైన ఈ పండగలు… నిన్నమొన్నటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. అలా టీంలో ప్రతి ఒక్కరు జనతా గ్యారేజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా మరోసారి తారక్.. ఈ సినిమాకు సంబంధించి ఫెస్టివల్స్ షురూ చేశాడు.

కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా తాజాగా 50రోజులు పూర్తిచేసుకుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 39 కేంద్రాల్లో జనతా గ్యారేజ్ 50 డేస్ ఫీట్ ను సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 39 కేంద్రాల్లో 50 రోజులు అంటే పెద్ద హిట్ కిందే లెక్క. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ఎంటైర్ జనతా గ్యారేజ్ కాస్ట్ అండ్ క్రూతో పాటు ఫ్యాన్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ఎన్టీఆర్. కొరటాల శికు స్పెషల్ థ్యాంక్స్ అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు.

సాయంత్రం అయ్యే సరికి మరోసారి సంబరాలు షురూ అయిపోయాయి. భారీ కేక్ రెడీ అయిపోయింది. ఈసారి జనతా గ్యారేజ్ టీంతో పాటు సోదరుడు కల్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా యాడ్ అయ్యాడు. అంతా కలిసి జనతా గ్యారేజ్ 50-డేస్ సంబరాల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తారక్-కల్యాణ్ రామ్ మధ్య అనుబంధం మరోసారి బయటపడింది. ఇద్దరూ ఎంతో చక్కగా కలిసిపోయారు.

Loading...

Leave a Reply

*