చైతు సినిమా తెలుగులో ఫ్లాప్.. త‌మిళంలో సూప‌ర్ హిట్‌…!

untitled-3

నాగ‌చైత‌న్య లేటెస్ట్ మూవీ.. సాహసం శ్వాస‌గా సాగిపో. ఏమాయ చేశావే తర్వాత గౌత‌మ్ మీన‌న్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 11 కానుక‌గా విడుద‌ల‌యింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డింది. సినిమాలో కంటెంట్ లేద‌నే కామెంట్స్‌తోపాటు స్లో నారేష‌న్ కూడా నెగిటివ్‌గా మారింది. దీనికితోడు, ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్ర‌క‌టించిన 500, 1000 రూపాయ‌ల నోట్ల ప్ర‌భావం కూడా దారుణంగా పడింది ఈ సినిమాపై. దీంతో, రిలీజ్ అయిన నాలుగో రోజుకే థియేట‌ర్లన్నీ ఖాళీగా క‌నిపిస్తున్నాయి.

తెలుగులో ఈ సినిమా ప‌రిస్థితి ఇలా ఉంటే.. త‌మిళంలో మాత్రం బంప‌ర్ వ‌సూళ్ల‌తో సాగిపోతోంది. ఇన్ని అవాంత‌రాలు ఉన్నా అధిగ‌మిస్తూ భారీ వ‌సూళ్లు పొందుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌కి ఈ చిత్రం 10 కోట్లు క్రాస్ చెయ్య‌డం విశేషం. ఇక్క‌డ నిరాశ ప‌రిచిన ఈ సినిమాకి త‌మిళ్‌లో మాత్రం మంచి రివ్యూస్ ద‌క్కాయి. పాజిటివ్ బ‌జ్ ఏర్ప‌డింది. ఇదే సినిమా క‌లెక్ష‌న్ల‌కి క‌లిసొచ్చింది. చిల్ల‌ర కొర‌త ఉన్నా.. థియేట‌ర్లు ఫుల్ అవుతున్నాయి.

అయితే, త‌మిళ్ వెర్ష‌న్‌లో హీరో నాగ‌చైత‌న్య కాదు. శింబు. ఏ సినిమాని అయినా మ‌ల్టీలాంగ్వేజెస్‌లో తెర‌కెక్కించ‌డం గౌత‌మ్ మీన‌న్ స్పెషాలిటీ. తెలుగులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ఈ చిత్రానికి త‌మిళ్‌లో శింబు క‌థానాయకుడు. హీరోయిన్ సేమ్‌. అక్క‌డా ఇక్కడా మంజిమా మోహ‌నే న‌టించింది. గ‌తంలో ఏమాయ చేశావే చిత్రాన్ని కూడా గౌత‌మ్ మీన‌న్ ఈ ఇద్ద‌రు హీరోల‌తోనే క‌లిసి చేశాడు. అది రెండు చోట్లా స‌క్సెస్ అయింది. మ‌రి, కానీ అదే మేజిక్ మిస్ అయింది రెండోసారి. త‌మిళ్‌లో ఈ చిత్రం ఎలాంటి స‌క్సెస్ పొందుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*