ప్ర‌భాస్ మైన‌పు బొమ్మ‌పై త‌మిళ మీడియా క‌డుపు మంట‌..!

tamil

టుస్సాడ్ మ్యూజియంలో బాహుబ‌లి హీరో మైన‌పు బొమ్మ‌.. తెలుగు వారి ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయికి పెంచిన అంశం. దేశంలో మ‌హాత్మాగాంధీ, న‌రేంద్ర మోదీ త‌ర్వాత మ‌రో భార‌తీయ సంత‌తి వ్య‌క్తి మైన‌పు బొమ్మ‌ను అక్క‌డ నెల‌కొల్ప‌డం ఇది మూడోసారి. అవును, మ‌రే వ్య‌క్తికి ఇంత‌టి అరుదైన గౌర‌వం ద‌క్క‌లేదు. బాహుబ‌లి స‌క్సెస్ క్రెడిట్ రాజ‌మౌళిదే కావొచ్చు.. కానీ, దానిని తెర‌పై ఆవిష్కరించిన వ్య‌క్తి ప్ర‌భాస్‌. అందుకే, ఆ బాహుబ‌లి వీరుడి మైన‌పు బొమ్మ‌ను అక్క‌డ ప్ర‌తిష్ఠిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లికి, ముఖ్యంగా సౌత్ ఏసియాలో బాహుబ‌లిని బాగా మార్కెట్ చేశారు. దాని ప్ర‌తిఫ‌ల‌మే ఈ మైన‌పు బొమ్మ‌.ప్ర‌భాస్‌కి, అందులోనూ ఓ తెలుగు హీరోకి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డం కొంద‌రు త‌మిళీయులు జీర్ణించుకోలేక‌పోతున్నారట‌.

ఇప్ప‌టికే, కొన్ని త‌మిళ్ వెబ్‌షైట్‌లు.. దీనిపై అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ట‌. రజ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌.. ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చేసినదానితో కంపేర్ చేస్తే… ప్ర‌భాస్ ఏం సాధించాడ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. వారి క్రేజ్‌, ఇమేజ్‌తో కంపేర్ చేస్తే ప్ర‌భాస్ ఎక్క‌డ? అని కూడా అడుగుతున్నారు.అది నిజ‌మే కావొచ్చు. ప్ర‌భాస్‌తో కంపేర్ చేస్తే ర‌జ‌నీకాంత్‌, క‌మల్ హాసన్‌కి భారీ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్త‌వం. కానీ, బాహుబ‌లి క్రేజ్‌, ఇమేజ్‌.. అది క్రియేట్ చేసిన రికార్డుల‌తో పాటు ఆ సినిమా తాలూకు ప్ర‌భావం కూడా టుస్సాడ్ మ్యూజియం వారిని ఆక‌ర్షించేలా చేసింది. ఇది ప్ర‌భాస్ పాపులారిటీని, ఆయ‌న సాధించిన విజ‌యాల‌ను బ‌ట్టి కాదు. ఆ ర‌కంగా చూసినా ఛ‌త్ర‌ప‌తి హీరో కంటే తెలుగులో ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి క‌థానాయ‌కుల‌కు ఫాలోయింగ్ ఉంది. ఇది ఫ్యాక్ట్‌.

కానీ, అక్క‌డ కొల‌మానం అది కాదు. బాహుబ‌లి.. అందుకే, టుస్సాడ్ మ్యూజియం కూడా బాహుబ‌లి హీరో మైన‌పు బొమ్మ‌ను పెడుతున్నామ‌న్నారు కానీ.. ప్ర‌భాస్‌ది అని చెప్ప‌డం లేదు. అయినా, దీనికి త‌మిళ్ మీడియా ఇంత రాద్ధాంతం చెయ్య‌డమేంట‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.సౌత్‌లో ఒక ఐకానిక్ మూవీగా బాహుబ‌లికి పేరొచ్చింది. దానికి ఈ స్థాయి వ‌చ్చినందుకు సంబ‌ర‌ప‌డాలి కానీ, ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌భాస్ అభిమానులు. ఇది క‌రెక్ట్ కాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. మ‌రి, ఇప్ప‌టిక‌యినా త‌మిళ్ మీడియా దీనిపై రాద్ధాంతాన్ని ఆపుతుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*