అవును…నేను కాస్త గట్టిగానే తీసుకుంటాను…     

tammu

తమన్న ఓపెన్ అయిపోయింది. ఇన్నాళ్లూ తెరవెనకున్న సంగతిని ఓపెన్ గా చెప్పేసింది. ఐటెంసాంగ్స్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించిన మిల్కీబ్యూటీ… అలాంటి సాంగ్స్ చేసేందుకు తాను కాస్త ఎక్కువే పుచ్చుకంటానని కూడా ఒప్పేసుకుంది. తాజాగా మిల్కీబ్యూటీ జాగ్వార్ అనే సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. హీరో కొత్త, దర్శకుడు, నిర్మాతలకు కూడా తమన్నతో పరిచయం లేదు. అయినప్పటికీ… అందులో స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్న ఒప్పుకుందంటే కారణం.. ఆమె ఒప్పుకున్న పారితోషికమే. ఆ సినిమాలో ఐటెంసాంగ్ చేసేందుకు తమన్న 2 కోట్ల రూపాయలు తీసుకుందనే టాక్ నడుస్తోంది. ఇదే విషయం ప్రశ్నిస్తే.. అవును ఐటెంసాంగ్స్ కోసం తను చాలా ఎక్కువ తీసుకుంటానని తమన్న క్లారిటీ ఇచ్చేసింది.

తను ఎంత తీసుకుంటాననే విషయాన్ని నేరుగా చెప్పకపోయినప్పటికీ… ప్రస్తుతం ఐటెంసాంగ్స్ కోసం మిగతా హీరోయిన్లు ఛార్జ్ చేస్తున్న ఎమౌంట్ కంటే తన రేటు కాస్త ఎక్కువేననే విషయాన్ని చెప్పేసింది. ఓ సినిమాకు తన ఐటెంసాంగే స్పెషల్ ఎట్రాక్షన్ అని తెలిసినప్పుడు ఆటోమేటిగ్గా ఎక్కువ ఆడుగుతానంటోంది మిల్కీబ్యూటీ.ఫ్యూచర్ లో కూడా ఐటెంసాంగ్స్ తప్పకుండా చేస్తానని… నిజానికి సినిమా చేస్తే వచ్చే ఎమౌంట్ కంటే ఐటెంసాంగ్ తో వచ్చే డబ్బులే ఎక్కువగా ఉన్నాయని అంటోంది తమన్న. పైగా కాల్షీట్లు కూడా తక్కువ కావడంతో ఇకపై కూడా ఐటెంసాంగ్స్ చేస్తానంటోంది. తన డాన్స్ కూడా ఐటెంసాంగ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా చెబుతోంది.

 

Loading...

Leave a Reply

*