మెగా కాంపౌండ్ లో దూకుడు ఫార్ములా

untitled-12

కెరీర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఎలా సంపాదించాడో గుర్తుందా… అయితే ఓసారి గుర్తుచేస్తాం. మహేష్ కోసమే ఎక్స్ క్లూజివ్ అనే రేంజ్ లో రెండు ట్యూన్స్ కంపోజ్ చేసుకున్నాడు. దూకుడు సినిమా ప్రారంభానికి ముందే ఆ రెండు ట్యూన్స్ ను నేరుగా మహేష్ కు వినిపించాడు. ఆ ట్యూన్స్ నచ్చడంతో వెంటనే దూకుడులో మహేష్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ రెండు పాటల్లో.. ఇటు రాయే.. ఇటు రాయే అనేది ఒక పాట అయితే… చుల్ బులీ పాట ఇంకోటి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మెగా కాంపౌండ్ లో కూడా ఎప్లై చేస్తున్నాడు తమన్

కెరీర్ స్టార్టింగ్ లో తనకు బూస్టప్ ఇచ్చిన దూకుడు ప్లాన్ ను మెగా కాంపౌండ్ లో ఇప్పటికే అమలుచేశాడు తమన్. ఏకంగా చిరంజీవి కోసం 2, పవన్ కోసం 2 పాటల్ని కంపోజ్ చేశాడు. ఆ పాటల్ని వాళ్లకు నేరుగా వినిపించాడు కూడా. ఈమధ్య ఖైదీ నంబర్ 150 సినిమా సెట్స్ లో సడెన్ గా తమన్ ప్రత్యక్షం అయ్యాడు. చిరు-తమన్ కలిసి దిగిన సెల్ఫీలు కూడా మీడియాలోకి వచ్చేశాయి గుర్తుందా. అవును.. సరిగ్గా అప్పుడే మెగాస్టార్ కు తన సిగ్నేచర్ ట్యూన్స్ వినిపించాడట తమన్. త్వరలోనే మెగాస్టార్ నుంచి పిలువు వస్తుందని ఆశిస్తున్నాడు.

ఇక ఇదే ఫార్మాట్ తో పవన్ నుంచి ఏకంగా గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడు. సేమ్ చిరుకు వినిపించినట్టుగానే పవన్ కు కూడా 2 ట్యూన్స్ వినిపించాడట తమన్. ఆ రెండూ నచ్చడంతో పవన్ వెంటనే ఛాన్స్ ఇచ్చాడట. అలా నేసన్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు తమన్ ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి దూకుడు ప్లానింగ్ బాగానే వర్కవుట్ అయింది.

Loading...

Leave a Reply

*