అన్నా… క్యాథరీన్ ను తీసేస్తున్నా…?

untitled-8

ఖైదీ నంబర్ 150 సినిమాకు సంబంధించి ఈ మధ్య జరిగిన హంగామా అంతా మనకు తెలిసిందే. ఎప్పట్నుంచో అనుకుంటున్న క్యాథరీన్ ను ఆఖరి నిమిషంలో తీసేశారు. అది కూడా ఐటెంసాంగ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైన కొన్ని గంటలకే క్యాథరీన్ ను తీసేయడం పెద్ద సెన్సేషన్ గా మారింది. దీనిపై క్యాథరీన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ మెగా కాంపౌండ్ నుంచి మాత్రం రోజుకో వార్త బయటకువస్తోంది.

సినిమాకు కాస్చ్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న మెగా తనయ సుస్మితకు, క్యాథరీన్ కు పడకపోవడం వల్లనే క్యాథరీన్ కు ఛాన్స్ మిస్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. సుస్మిత డిజైన్ చేసిన దుస్తులు క్యాథరీన్ కు నచ్చలేదని, వాదనకు దిగడంతో సుశ్మిత క్యాథరీన్ ను తీసేసిందనే టాక్ ఉంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది.

క్యాథరీన్ ను తీసేయాలనే నిర్ణయాన్ని చిరు తనయ సుశ్మిత ఏకపక్షంగా తీసుకుందట. క్యాథరీన్ తో వాదనలు మరీ ఎక్కువ అవ్వడంతో.. స్పాట్ లో ఉన్నఫలంగా సెట్స్ వదిలి వెళ్లిపోమని క్యాథరీన్ కు చెప్పిందట సుశ్మిత. అయితే ఆ మాట అనేముందు… నిర్మాత, సోదరుడు అయిన రామ్ చరణ్ కు ఫోన్ చేసి మరీ విషయం చెప్పి, క్యాథరీన్ ను బయటకు పంపించేసిందట. సో.. ఈమొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి ప్రమేయం ఏమీ లేదనే విషయం మరోసారి రుజువైంది.

Loading...

Leave a Reply

*