కాష్మోరా క‌లెక్ష‌న్ల‌కి బిత్త‌ర‌పోయిన సూర్య‌..!

untitled-6

కాష్మోరా.. కార్తి న్యూ మూవీ.. దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల‌యిన ఈ సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వాన కురిపిస్తోంది. దీపావ‌ళి రేస్‌లో టాలీవుడ్ మూవీ ఏదీ లేక‌పోవ‌డంతో కార్తీకి బాగా క‌లిసి వ‌చ్చింది. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ద‌క్కాయి కాష్మోరాకి. శుక్ర‌వారం ఏకంగా 4.5 కోట్లు క‌లెక్ట్ చేసింది. మీడియం రేంజ్ హీరోల మార్కెట్ ఇది. చైతు ప్రేమ‌మ్ కేవ‌లం తొలి రోజు 2.5 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ట‌. అదే క‌ల్యాణ్‌రామ్ ఇజం ఫ‌స్ట్ డే 3 కోట్ల వ‌ర‌కు సాధించింది. అంటే, ఈ రెండు సినిమాల‌తో కంపేర్ చేస్తే కార్తి కాష్మోరా మార్కెట్ చాలా ఎక్క‌వ‌ని అర్ధం అవుతోంది. ఇక‌, రెండో రోజు మూడో రోజు కూడా ఇదే రేంజ్‌లో వ‌సూళ్లు సాధించింద‌ట కాష్మోరా. ఇప్ప‌టికే సుమారు 10 కోట్ల మార్క్‌కి రీచ్ అయింద‌ట కాష్మోరా.

తెలుగులో ఈ క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం చూసి కార్తి బ్ర‌ద‌ర్ సూర్య కూడా షాక్ అయ్యాడ‌ట‌. కార్తి మార్కెట్ ఈ రేంజ్‌లో పెరిగింద‌ని ఆయ‌న అస‌లు ఎక్స్‌ఫెక్ట్ చెయ్య‌లేద‌ట‌. గ‌జినితో టాలీవుడ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్య‌. ఆ త‌ర్వాత య‌ముడు, సింగ‌మ్ సినిమాల‌తో ఆయ‌న రేంజ్ పెరిగింది. 25 కోట్ల మార్కెట్‌పైగానే సాధించాడు తెలుగులో సూర్య‌. కాష్మోరాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది లేదంటే.. సూర్య మార్కెట్‌ని ఈజీగా రీచ్ అయ్యేవాడు కార్తి ఈ మూవీతో. ఇలా, త‌మ్ముడు ప్ర‌ద‌ర్శ‌న‌తో షాక్ అయ్యాడ‌ట బ్ర‌ద‌ర్ సూర్య‌.

మ‌రోవైపు, ఈ ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల‌యిన ఊపిరి చిత్రంతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ సినిమా తెలుగులో 40 కోట్ల మార్క్‌ని అందుకుంది. కాష్మోరాతో కార్తికి ఇది బాగా క‌లిసి వ‌చ్చింది. తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చెయ్య‌డంతో కార్తి మార్కెట్ పెరిగిందంటున్నారు విశ్లేష‌కులు. ఇటు, కాష్మోరా ట్ర‌యిల‌ర్ కూడా వైవిధ్యంగా ఉంది. బాహుబ‌లి, అరుంధ‌తి, మ‌గ‌ధీర లుక్స్‌తో రావ‌డం, కార్తి మేకోవ‌ర్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. సినిమా రేంజ్‌ని పెంచ‌డంలో ఇది కూడా అడ్వాంటేజ్ అయింది. మొత్త‌మ్మీద‌, కార్తికి మ‌రో హిట్ ప‌డితే.. తెలుగులో చాలా మంది యంగ్ హీరోల‌కంటే ఆయ‌నే ముందుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Loading...

Leave a Reply

*