ఎన్టీఆర్‌ని టైమ్ చూసి దెబ్బ‌కొట్టిన అగ్ర ద‌ర్శ‌కుడు..!

ntr

తార‌క్ టైమ్ అంత‌గా బాగాలేన‌ట్టుంది. ఆయ‌నకు కాలం క‌లిసి రావ‌డం లేదు. లేక‌పోతే ఏంటి…? జ‌న‌తా గ్యారేజ్ వంటి సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత తార‌క్ ఖాళీగా ఉండడం ఏంటి..? అలాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు ఏ హీరో ద‌గ్గ‌రికయినా క్యూ క‌డ‌తారు. కానీ, తార‌క్ సిచ్యువేష‌న్ పూర్తి రివ‌ర్స్‌లో ఉంది. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, వినాయ‌క్ వంటి ద‌ర్శ‌కులు ఫుల్ బిజీగా ఉండ‌డంతో వేరే సినిమాల‌తో ఎంగేజ్ అయి ఉండ‌డం ఆయ‌న‌కు బిగ్ మైన‌స్‌గా మారింది. పూరి, శ్రీను వైట్ల రేంజ్ ప‌డిపోయింది.ఇక‌, వారితో ఎందుకులే అని తన‌తో గ‌తంలో రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిని అప్రోచ్ అయ్యాడ‌ట‌.

అయితే, ఆయ‌న ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం చెర్రీతో ధృవ సినిమా చేస్తున్న సురేంద‌ర్ ఈ మంత్ ఎండింగ్‌కి ఫ్రీ అవుతాడు. మ‌రో 30రోజుల్లో ఆయ‌న డేట్స్ ఖాళీ అవుతాయి. దీంతో, ఆయ‌న‌తో సినిమా చెయ్యాల‌ని ప్లాన్ చేసిన తార‌క్‌కి ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింది. తాను ఫ్రీగా లేన‌ని ఇప్ప‌టికే ఓ సినిమా క‌మిట‌య్యాన‌నే ఆన్స‌ర్ వ‌చ్చింద‌ట‌. అది కూడా జాగ్వార్ సినిమా హీరో నిఖిల్ గౌడ్ మూవీకి క‌మిట‌య్యాడ‌ట‌. ఈ సినిమా కోసం సురేంద‌ర్ రెడ్డికి 11 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ట నిఖిల్ గౌడ తండ్రి, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామిగౌడ.అస‌లు మేట‌ర్ మ‌నీ కాద‌ని, అంత‌కుమించి వేరే ఉంద‌నే కథ‌నాలు వినిపిస్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి-తార‌క్ కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చాయి.

అశోక్‌తోపాటు ఊస‌ర‌వెల్లి సినిమా కూడా వీరి కాంబోలో వ‌చ్చింది. అయితే, ఊస‌రవెల్లి సినిమా టైమ్‌లో తార‌క్ సురేంద‌ర్‌రెడ్డిని బాగా ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని, దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌నే పుకార్లు ఉన్నాయి. కిక్ సీక్వెల్ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో అంద‌రి గురించి మాట్లాడిన సురేంద‌ర్ రెడ్డి తార‌క్ విష‌యం మ‌రిచిపోయాడు. చివ‌రికి, హీరో ర‌వితేజ గుర్తు చేసిన త‌ర్వాత మ‌రోసారి మైక్ తీసుకొని తూతూ మంత్రంగా రెండు మాట‌లు మాట్లాడాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. అందుకే, సురేంద‌ర్ రెడ్డి తార‌క్ సినిమాకి క‌మిటవ్వ‌లేద‌ట‌. ఇందులో నిజ‌మెంత అనేది వారికే తెలియాలి. టోట‌ల్‌గా తార‌క్‌తో సినిమా చెయ్య‌న‌ని సురేంద‌ర్ రెడ్డి చెప్ప‌డం.. ఆయ‌న‌ను టైమ్ చూసి దెబ్బ కొట్టినయింద‌ని సినీ జ‌నాలు చెప్పుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*