ప్రతిష్టాత్మక పరీక్షలో సన్నీ లియోన్ ప్రస్తావన

untitled-2

హాట్ బ్యూటీ, ఉన్నవి చూపించడానికి ఏమాత్రం భయపడని సన్నీలియోన్ ఇప్పుడు ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోకి కూడా ఎక్కింది. ఓ పరీక్ష పత్రంలో సన్నీలియోన్ పేరు కనిపించేసరికి, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్లంతా షాక్ అయ్యారు. ఇదేం చోద్యంరా బాబూ అంటూ తలపట్టుక్కూర్చున్నారు. అయితే సన్నీలియోన్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించే మద్దతుదార్లు కూడా ఎక్కువవ్వడం ఆశ్చర్యం.

రీసెంట్ గా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్ష పేపర్లో ఎవరూ ఊహించని ప్రశ్న, దానికింద నాలుగు ఆన్సర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ప్రశ్న.. ‘ఆల్ఫాబెట్ సూప్ ఫర్ లవర్స్’ అనే బుక్ ఆథర్ ఎవరనేది కాగా, ఈ మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ కు ఓ ఆప్షన్ గా సన్నీలియోన్ పేరు ప్రింట్ చేశారు. దాంతో పరీక్ష రాసిన అభ్యర్థులు ఒక్క క్షణం షాక్ అయ్యారట. ఇక ఆ తర్వాత ఏ ఆలోచనా లేకుండా ఎవరి పేరు పడితే వారి పేరు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించడం మొదలెట్టారట. ముఖ్యంగా ప్రశ్నా పత్రాన్ని తయారుచేసిన వాళ్లపై జనం విరుచుకుపడుతున్నారట.

చిన్న చిన్న తప్పులు జరగడం మామూలే అయినా.. ఇలా కనీసం సమర్థించుకోలేని విధంగా ఉండకూడదనే విమర్శలు ఎక్కవయ్యాయి. అంతేకాకుండా అభిమానం ఉంటే మనస్సులో ఉండాలి గాని.. ఇలా పరీక్ష పేపర్లో పెట్టడం వెనుక అర్థం ఏంటో చెప్పాలనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. మరోవైపు, అసలు నాలుగు ఆప్షన్లలో ఒకటిగా సన్నీలియోన్ పేరు ఉంటే తప్పేంటనే వాదన కూడా బాగానే వినిపిస్తుంది.

Loading...

Leave a Reply

*