అన్నయ్య అంటే ఇష్టం… అందుకే హ్యాండ్ ఇచ్చా…

sunil

ప్రస్తుతం సునీల్ పరిస్థితి ఇదే. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టం అంటాడు సునీల్. చిరును చూసే సినిమాల్లోకి వచ్చానని చెబుతుంటాడు. చిరంజీవి స్ఫూర్తితోనే డాన్స్ నేర్చుకున్నానని కూడా అంటుంటాడు. తనకు కలలో కూడా అన్నయ్య మాత్రమే కనిపిస్తాడని చెప్పకొస్తుంటాడు. అలాంటి అన్నయ్య అడిగితే మాత్రం కాల్షీట్ లేవన్నయ్యా అంటూ కూల్ గా తప్పించుకుంటాడు. కానీ సేమ్ టైం.. పవన్ అడిగితే మాత్రం ఎన్ని రోజుల డేట్స్ అయినా ఇస్తాడు. ఇదీ ఇప్పుడు సునీల్ పరిస్థితి.

కమెడియన్ నుంచి హీరోగా ఎదిగాడు సునీల్. ఎదిగాను అని అతడు అనుకుంటాడు. కానీ ప్రజలు మాత్రం ఇంకా సునీల్ ను హీరోగా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే కామెడీ పాత్రలు వేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సునీల్ మరోసారి నవ్విస్తే చూద్దామనే కోరుకుంటున్నారు. కానీ సునీల్ మాత్రం హీరో వేషాలే వేస్తున్నాడు. ఇదిలా ఉండగా… కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు సునీల్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. చిరంజీవి 150వ సినిమాలో నటించే అవకాశం అది. పైగా కామెడీని అద్భుతంగా పండించే వినాయక్ దర్శకత్వంలో మూవీ.

కానీ సునీల్ మాత్రం నో చెప్పేశాడు. సినిమాలతో బిజీగా ఉన్నానంటూ తప్పించుకున్నాడు.కట్ చేస్తే.. సునీల్ ఇప్పుడు మరోసారి హాస్యనటుడిగా మారడానికి రెడీ అయిపోతున్నాడు. అప్పుడు చిరంజీవి అడిగితే కాల్షీట్లు లేవన్నాడు. కానీ ఇప్పుడు ప్రాణస్నేహితుడు త్రివిక్రమ్ అడిగితే మాత్రం కాదనలేకపోయాడు. త్వరలోనే పవన్ తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాలో సునీల్.. కమెడియన్ రోల్ పోషించబోతున్నాడు.

Loading...

Leave a Reply

*