చైతుని ముంచుతున్న సునీల్ ప్లాన్‌..!

sunil-and-chaitu

ఈ వీకెండ్ మూడు సినిమాలు విడుద‌లకానున్నాయి. ప్రేమ‌మ్‌, వీడు గోల్డ్ ఎహె, అభినేత్రి.. ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ ఫైట్ నెల‌కొంది. చిన్న సినిమాలే అయినా.. మంచి ఆస‌క్తి నెల‌కొంది ఈ మూడు సినిమాల‌పై. అయితే, ప్ర‌మోష‌న్ ప‌రంగా అంద‌రికంటే.. ముందున్నాడు సునీల్‌. సినిమా రిలీజ్‌కి ముందు సంగ‌తేమో కానీ.. రిలీజ్‌కి ముందు సునీల్ ముందు ఆ రెండు సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరో, హీరోయిన్‌లు చేతులెత్తాశార‌నే చెప్పొచ్చు.

ఏడాది త‌ర్వాత చైతు నుంచి వ‌స్తున్న మూవీ ప్రేమ‌మ్‌. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్న మాట వాస్త‌వ‌మే. అయితే, సినిమాని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాతలు దారుణంగా ఫెయిల‌య్యార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప్యూర్ రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్ కావ‌డంతో ట్ర‌యిల‌ర్‌కే యూత్ బాగా క‌నెక్ట్ అయ్యింది. కానీ, విడుద‌ల ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ప్ర‌మోష‌న్‌లో వెనుక‌బ‌డింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. రిలీజ్ ఎల్లుండి అన‌గా .. ఇవాళ హీరోగారు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇంట‌ర్‌వ్యూలు ఇచ్చారు. అయితే, కేవ‌లం స‌మంత‌తో ల‌వ్ ఎపిసోడ్‌తో ప్రేమ‌మ్‌కి కావాల్సిన ప‌బ్లిసిటీ వ‌చ్చేసింద‌నే భావ‌న‌లో ఉన్నార‌ట టీమ్‌. సోష‌ల్ మీడియా పుకార్ల‌కు త‌ప్ప‌… ఇలాంటివి సినిమా ఓపెనింగ్స్ పెంచ‌డానికి ఇదేమైనా బాలీవుడ్డా.. అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు.

మ‌రోవైపు, అభినేత్రి సినిమాకి ప్ర‌భుదేవా, త‌మ‌న్న త‌మ క‌ష్టం తాము ప‌డుతున్నారు. ఈ సినిమాకి కొంత‌మంది ఆడియెన్స్ ఎలాగూ ఉంటారు కాబ‌ట్టి వారి గ్యారంటీగా వ‌స్తార‌ని ధీమాగా ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాతలు.

నాగ‌చైత‌న్య‌, అభినేత్రి టీమ్‌కంటే.. సునీల్ చాలా ముందున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న అన్ని టీవీల‌కు ఇంట‌ర్‌వ్యూలు ఇచ్చేశాడు. ఇటు, రియాలిటీ షోల‌లోనూ ఆయ‌న హంగామా చేస్తున్నాడు. అటు తెలుగింటి ఆడ‌ప‌డుచుల సీరియ‌ల్స్‌లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. ఇలా విడుద‌ల‌కు ముందే ఇంటింటి రామాయ‌ణంలాంటి సీరియ‌ల్స్‌లో గ‌డ‌ప గ‌డ‌ప తొక్క‌తున్నాడ‌న్నమాట‌. ఇలా, విజ‌య‌ద‌శ‌మి రేస్‌లో సునీల్ బాగా లీడ్‌లో ఉన్నాడు. మ‌రి, చైతు సునీల్‌ని క్రాస్ చేస్తాడా..? ఎందుకంటే, బీ సీ సెంట‌ర్‌ల‌లో సునీల్‌కి మంచి ప‌ట్టుంది. అదే ఆయ‌న‌కు అడ్వాంటేజ్ కానుంది. చూద్దాం. సునీల్ జోరు చైతుకి చెక్ పెడుతుందో లేదో..?

Loading...

Leave a Reply

*