ఈడు గోల్డ్ ఎహె.. మార్నింగ్ షో టాక్‌..!

sunil-eedu-gold-ehe-first-morning-show-talk

సినిమా.. ఈడు గోల్డ్ ఎహె
న‌టీన‌టులు.. సునీల్‌, సుష్మారాజ్‌, రిచా ప‌నోయ్‌, పృధ్వీ, వెన్నెల కిషోర్‌, జ‌య‌సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను
సంగీతం.. సాగ‌ర్ మ‌హ‌తి
సినిమాటోగ్ర‌ఫీ.. దేవ‌రాజ్‌
ఎడిటింగ్‌.. మార్తాండ్ కె వెంక‌టేష్‌
నిర్మాత‌.. ఏకే ఎంట‌ర్‌ట‌యిన్‌మెంట్స్‌
ద‌ర్శ‌క‌త్వం.. వీరు పోట్ల‌

మూడేళ్లుగా స‌రైన హిట్‌లేని సునీల్‌.. ఈ ఏడాది జ‌క్క‌న్నతో ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఆ సినిమాకి యావ‌రేజ్‌గా నిలిచింది. మంచి వసూళ్లు పొందింది. దీంతో, ట్రాక్ ఎక్కాడు మ‌ర్యాద‌రామ‌న్న‌. మ‌రి, జ‌క్క‌న్న త‌ర్వాత ఆయ‌న ఈడు గోల్డ్ ఎహెతో మ‌రోసారి ప‌క్కా ఫుల్ లెంగ్త్ కామెడీని న‌మ్ముకున్నాడు. ఆయ‌న న‌టించిన ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుంది..? ద‌స‌రా సీజ‌న్‌లో నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. మ‌రి, ఈ రేస్‌లో సునీల్ విజ‌యం ద‌క్కించుకున్నాడా..? పోటీలో అసలు నిలిచాడా..? లేదా…? అనేది చెక్ చేద్దాం..

సునీల్ ఓ మంచి వ్య‌క్తి. ఓ మృదు స్వ‌భావి. ఇత‌రుల క‌ష్ట‌సుఖాల‌లో పాలు పంచుకోవాల‌నే స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి. అయితే, ఆయ‌న దుర‌దృష్ట జాత‌కుడు అని అంటుంటారు. ఏదైనా కార్యం మొద‌లుపెట్టిన వారికి సునీల్ ఎదుర‌యితే.. అది అశుభంగా మారుతుంద‌ట‌. దీంతో, ఆయ‌న ఎక్కువ కాలం ఏ జాబ్‌లోనూ ఉంచ‌రట య‌జ‌మానులు. ఏ ఉద్యోగంలోనూ ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా ఉండ‌డు సునీల్‌. ఇలా జాబ్స్ మారుతూ ఒక చోటి నుంచి మ‌రో చోటికి మారే క్ర‌మంలో ఆయ‌న‌కు ఓ తల్లి, కొడుకు ఎదురుప‌డ‌తారు. వారికి అండ‌గా ఉంటాన‌ని మాటిస్తాడు. ఇలా, సునీల్‌కి ఓ కుటుంబం ఏర్ప‌డుతుంది.

ఇలా సాఫీగా సాగిపోతున్న సునీల్‌కి, ఆయ‌న అన్న పిలిచి ఉద్యోగం ఇస్తాడు. అత‌ను పెద్ద క్రిమిన‌ల్‌. కిడ్నాప్‌లు, మ‌ర్డ‌ర్‌లు, సెటిల్‌మెంట్‌లు, దందాలు.. ఇదీ సునీల్ అన్న వ్య‌వ‌హారం. అలాంటి వ్య‌క్తి సునీల్‌ని ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరికిస్తాడు. మ‌రి, సునీల్ ఈ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు..? విల‌న్ గ్యాంగ్ ఆట ఎలా క‌ట్టించాడు..? ఈడు గోల్డ్ అని ప్రూవ్ చేసుకున్నాడా..? లేదా? అనేది అస‌లు క‌థ‌.

నిన్న‌మొన్న‌టిదాకా సునీల్ ఆల్‌రౌండ‌ర్‌గా ప్రూవ్ చేసుకోవాల‌ని కామెడీని ప‌క్క‌న‌పెట్టాడు. ఆ వ్యూహం బెడిసి కొట్ట‌డంతో సునీల్‌.. ప‌క్కా కామెడీ రోల్‌ని ఎంచుకున్నాడు. త‌న మార్క్ చూపించాడు జ‌క్క‌న్న‌తో. ఇక‌, ఈడు గోల్డ్ ఎహె సినిమాతో ఆయ‌న మ‌రింత రెచ్చిపోయాడంటున్నారు. త‌న‌కు సెట్ అయిన కామెడీ క‌థ‌తో బాగా మెప్పించాడ‌ట‌. సునీల్ కామెడీకి వెన్నెల కిషోర్‌, ప్ర‌భాస్ శ్రీను, ష‌క‌ల‌క శంక‌ర్‌, పృధ్వీ కూడా తోడ‌వ‌డంతో సినిమాలో ప్ర‌తి సీన్ బాగా పండింద‌ట‌. సునీల్ కామెడీ టైమింగ్‌కి, పంచ్‌ల‌కి మంచి మార్కులు ప‌డుతున్నాయి.

ద‌ర్శ‌కుడు వీరు పోట్ల‌.. ఈ సినిమాని ఎంట‌ర్‌ట‌యినర్‌గా తీర్చి దిద్ద‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ట‌. బిందాస్‌, ర‌గ‌డ‌, దూసుకెళ్తా వంటి సినిమాల‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్న వీరు పోట్ల ఈడు గోల్డ్ ఎహెతో మ‌రోసారి రెచ్చిపోయాడంటున్నారు ప్రేక్ష‌కులు. త‌న మార్క్ కామెడీకి, సునీల్ కూడా తోడ‌వ‌డం బాగా క‌లిసి వ‌చ్చింద‌ట‌. ప్ర‌తి సీన్‌ని బాగా రాసుకోవ‌డం సినిమాకి క‌లిసి వ‌చ్చిందంటున్నారు. కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా యాడ్ కావ‌డంతో ఈడు గోల్డ్ ఎహెకి అడ్వాంటేజ్‌గా మారింద‌ట‌. హీరో-విల‌న్ మ‌ధ్య వార్ సీన్‌ల‌ని వీరు పోట్ల బాగా తెర‌కెక్కించాడ‌ట‌. ఈ సీన్‌లు ఆడియెన్స్‌కి ఈజీగా క‌నెక్ట్ అవుతాయ‌ని భావిస్తున్నారు విమ‌ర్శ‌కులు.

సునీల్ యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు కూడా బాగా చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న క‌థ‌లో సునీల్ ఇర‌గ‌దీశాడ‌ని, ఆయ‌న కామెడీ సినిమా రేంజ్‌ని పెంచుతుంద‌ని ధీమాగా ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. రిచాపనోయ్‌, సుష్మారాజ్ గ్లామ‌రస్‌గా క‌నిపించారు. మొత్త‌మ్మీద‌, సునీల్ ఈడు గోల్డ్ ఎహెకి పాజిటివ్ టాక్ ద‌క్కింద‌ని సినిమా యూనిట్ ఖుషీ ఖుషీగా ఉంద‌ట. మ‌రి, ద‌స‌రా రేస్‌లో నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వీటిలో ఈడు గోల్డ్ ఎహె ఏ రేంజ్‌ స‌క్సెస్ ద‌క్కించుకుంటుందో చూడాలి.

Loading...

Leave a Reply

*