త్రివిక్ర‌మ్ సినిమాలో సునీల్ విల‌న్‌

untitled-12

అత‌డు టాలీవుడ్ డైరెక్ట‌ర్లలో సూప‌ర్‌స్టార్‌… ఇత‌డు టాలీవుడ్‌లో కామెడీ హీరో… ఇద్ద‌రు పాత ఫ్రెండ్స్ కూడా… వాళ్లిద్ద‌రే త్రివిక్ర‌మ్ అండ్ సునీల్‌… ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలో సునీల్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని టాక్‌… అయితే ఇదంతా కామెడీ కాదు నిజంగానే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు… మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ మొద‌టినుంచి మంచి స్నేహితులు… త్రివిక్ర‌మ్ సినిమా లతోనే సునీల్ స్టార్ క‌మెడియ‌న్‌గా ఎదిగాడు… ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… అయినా త‌న‌ను కామెడీగానే చూస్తున్నార‌ని అర్థం చేసు కుని సిక్స్ ప్యాక్ డెవ‌ల‌ప్ చేసుకుని కండ‌ల‌వీరుడిగా ఎదిగాడు… అయితే ఈ కామెడీ హీరో ఇప్పుడు విల‌న్‌గా అవ‌తారం ఎత్త‌బోతున్నాట్ట‌… ఈ విష‌యాన్ని సునీలే స్వ‌యంగా చెప్పాడు..

త‌న తాజా చిత్రం ఈడు గోల్డ్ ఎహే ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న సునీల్ త్వ‌ర‌లోనే విలన్‌గా మార‌బోతు న్న‌ట్టు ప్ర‌క‌టించాడు… అయితే అది తెలుగు సినిమాల్లో మాత్రం కాద‌ట‌…. ఎందుకంటే సునీల్‌ని క‌మెడియ‌న్‌గానే చూసిన తెలుగు ప్రేక్ష‌కులు అత‌డు విలన్‌గా న‌టించినా కామెడీగానే ఫీల‌వుతారు… అందుక‌ని ఇతర భాష‌ల్లో విల‌న్‌గా వేస్తానంటున్నాడు ఈ విల‌క్ష‌ణ న‌టుడు. అయితే సునీల్ విలన్‌గా వేయ‌బోయేది త్రివిక్ర‌మ్ సినిమాలో అనే ఊహాగానాలు జోరుగా న‌డుస్తున్నాయి… ఇప్ప‌టికే చాలామంది త‌మిళ్ స్టార్స్ త్రివిక్ర‌మ్‌తో చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు… కోలీవుడ్ బ‌డా స్టార్స్‌తో చేయ‌డానికి త్రివిక్ర‌మ్ కూడా రెడీగానే ఉన్నాడు… త్రివిక్ర‌మ్‌-సూర్య‌ కాంబినేష‌న్‌లో ఓ సినిమా కోసం చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే భ‌విష్య‌త్తులో త‌మిళ్‌లో బ‌డా స్టార్స్‌తో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌డం ఖాయం. ఆ సినిమాలోనే సునీల్ విల‌న్‌గా మేక‌ప్ వేసుకోవడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

Loading...

Leave a Reply

*