మహేష్ తో 350 కోట్ల సినిమా

untitled-17

ఈమధ్యే రామ్ గోపాల్ వర్మ 350కోట్ల రూపాయ భారీ బడ్జెట్ సినిమా ప్రకటించాడు. దానికి న్యూక్లియర్ అనే పేరు కూడా పెట్టాడు. ఘనంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమా ఉంటుందని కూడా అదరగొట్టాడు. కానీ దాన్ని అంతా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే వర్మను నమ్మి ఎవడూ అంత డబ్బు పెట్టడు. పైగా ఇంతకుముందు ఇలాంటివే చాలా ప్రకటనలు చేసిన వర్మ.. ఆ సినిమాలన్నింటినీ గాలికి వదిలేశాడు. సరే.. ఆ మేటర్ ను పక్కనపెడితే.. ఇప్పుడు మరో 350 కోట్ల బడ్జెట్ సినిమా తెరపైకి వచ్చింది.

మహేష్ బాబు తో 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించాలని ఒకనాటి గ్లామర్ తార ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శకులు సుందర్ సి తెగ ఉబలాటపడుతున్నాడట. ఇప్పటికే ఒకసారి ఆ సినిమా చేసేది లేదని తేల్చి చెప్పేసాడు మహేష్. అయినప్పటికీ సుందర్ మాత్రం మన ప్రిన్స్ ను వదలడం లేదట. తప్పనిసరిగా మహేష్ ని ఒప్పిస్తాను ,ఆ భారీ బడ్జెట్ సినిమా చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాడట . తెలుగు -తమిళ – హిందీ బాషల్లో ఆ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక ఆ చిత్రాన్ని తేనాండాల్ మూవీస్ సంస్థ నిర్మించడానికి రెడీగా ఉంది. సౌత్ లోనే ప్రముఖ నిర్మాణ సంస్థ గా తేనాండాల్ బ్యానర్ కు పేరుంది. దాంతో మహేష్ ఒప్పుకుంటాడని సుందర్ గట్టి నమ్మకంగా ఉన్నాడు. మహేష్ ఎన్నిసార్లు నో చెప్పినా.. మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని అంటున్నాడట. మహేష్ ఏమో ప్రస్తుతానికి 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Loading...

Leave a Reply

*