న‌రుడా.. డోన‌రుడా.. ప్రివ్యూ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే…..!

sumanth

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందిన‌ కొత్త చిత్రం `నరుడా.. డోన‌రుడా..`. అన్నపూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మించారు. సెన్సార్ నుంచి ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమాకి మంచి మార్కులు వేశార‌ట సెన్సార్ స‌భ్యులు.

క‌థ‌..!

హైదరాబాద్‌కి చెందిన షేక్‌పేట కుర్రాడు విక్రమ్‌ (సుమంత్‌). జేబు ఖర్చులకి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడే ఓ సగటు నిరుద్యోగి. అనుకోకుండా అతడితో ఫెర్టిలిటీ సెంట‌ర్ డాక్ట‌ర్ అయిన డా.ఆంజనేయులు (తనికెళ్ల భరణి)కి అవసరం ఏర్పడుతుంది. వీర్యం దానం చేయాలని, చేస్తే భారీగా డబ్బు ఇప్పిస్తానని విక్రమ్‌కి ఆశ చూపుతాడు ఆంజనేయులు. అప్పటిదాకా రక్తదానం గురించి, అవయవ దానం గురించి మాత్రమే విన్న విక్రమ్‌ వీర్యదానం చేసేందుకు ఒప్పుకొన్నాడా? అతనికీ, బెంగాలీ అమ్మాయి ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌)కి మధ్యనున్న సంబంధమేమిటి? ఇదీ.. క‌థ‌.

హిందీలో సూప‌ర్‌హిట్ అయిన విక్కీ డోనార్‌కి ఇది రీమేక్‌. తెలుగులోనూ సినిమా బాగా వ‌చ్చింద‌ట‌. కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్‌.. హిందీలో హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నేటివిటీకి మార్చ‌డంలో బాగా స‌క్సెస్ సాధించాడ‌ని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఇది కాస్త డాక్యుమెంట‌రీలా తెర‌కెక్కినా.. తెలుగులో దానికి క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చాడ‌ట మ‌ల్లిక్ రామ్‌. ముఖ్యంగా సుమంత్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ధ్య వ‌చ్చే సీన్‌ల‌లో కాస్త బూతు డైలాగులు, ద్వంద్వార్ధాలు వినిపించినా సినిమాకి ఇవే హైలైట్‌గా మార‌తాయని భావిస్తున్నార‌ట‌. అందుకే, క్లీన్ యూ స‌ర్టిఫికెట్ కాకుండా.. యూ/ఏ స‌ర్టిఫికెట్ తెచ్చుకుంద‌ట ఈ చిత్రం.

గోదావ‌రి, గోల్కొండ హైస్కూల్ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల త‌ర్వాత సుమంత్ కొంత గ్యాప్ తీసుకొని న‌టిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో సుమంత్ మ‌రోసారి త‌న స‌టిల్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడట‌. త‌నికెళ్ల భ‌ర‌ణి రోల్ కూడా మూవీకి ప్ల‌స్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. హిందీలో విక్కీ డోనార్ ఎక్కువ‌గా మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఆడింది. అర్బ‌న్ ఏరియాస్‌లోనే ఈ సినిమాని చూశారు. తెలుగులో దీనిని అన్ని ప్రాంతాల వారు చూసేలా మ‌ల్లిక్ రామ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేశాడ‌ట‌. దీంతో, సుమంత్ రీ ఎంట్రీ ఇన్నింగ్స్ అదిరిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు కొంద‌రు.

Loading...

Leave a Reply

*