వీర్యదానం చేయమని స్వయంగా ఏఎన్నార్ చెప్పారట…

anr

ఈ సుమంత్ మరీ అతి చేస్తున్నాడబ్బా. విక్కీ డోనర్ సినిమా రీమేక్ అనుకున్న సమయానికి అక్కినేని మన మధ్య లేరు. అలాంటిది ఇప్పుడు ఆ సినిమాకు రీమేక్ గా నరుడో డోనరుడా సినిమా తెరకెక్కితే.. అందుకు ప్రచారం కోసం అక్కినేని పేరును ప్రస్తావించడం ఏం బాగాలేదని చాలామంది భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీర్యదానం చేసేలాంటి పాత్రల్ని చేయమని తాతగారు ఎప్పుడూ చెప్పేవారంటూ సుమంత్ చెప్పడంతో అంతా హవ్వా అనుకుంటున్నారు.

కథ ఎప్పుడైనా కొత్తగా ఉండాలి.. అందులో క్యారెక్టరైజేషన్ మరింత కొత్తగా ఉండాలి.. అప్పుడే చూసే ఫ్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతాడు. మనకు క్రేజ్ తెచ్చిపెడతాడు అనేది అక్కినేని మాట. ఆ మాటను ఆ కాంపౌండ్ లోని హీరోలంతా ఎప్పుడూ పాటిస్తూనే ఉంటారు. తాజాగా చైతూ కూడా ప్రేమమ్ తో అదే పని చేశాడు. కానీ వీర్యదానం చేసేలాంటి పాత్ర ఒకటి చేయాలని… అప్పట్లోనే అక్కినేని సుమంత్ కు చెప్పారట. ఇది మాత్రం కొంచెం అతి అనిపిస్తోంది.

సరే.. సుమంత మాటెలా ఉన్నా నరుడు..డోనరుడా సినిమా మాత్రం ఈనెల 4న.. అంటే ఈ వీకెండ్ న థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సుమంత్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు కూడా ఈసారి సుమంత్ కు దక్కాలని మనసారా కోరుకుందాం…

Loading...

Leave a Reply

*