మళ్లీ వంద కోట్ల బడ్జెట్ వర్కవుట్ అవుతుందా…

prabha

సినిమాకు వందకోట్ల రూాపాయల బడ్జెట్ పెట్టడం ఖర్చుపెట్టడం పెద్ద సమస్య కాదు. కోట్లు కుమ్మరించేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వందకోట్ల రూపాయల్ని తిరిగి రాబట్టుకోవడం, అంతకుమించి లాభాలు పొందడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అదే తెలిస్తే కేటీ కుంజుమన్ లాంటి దర్శకులు, ఏఎమ్ రత్నం లాంటి నిర్మాతలు ఈపాటికి బిలియనీర్లు అయిపోయేవాళ్లు.కానీ వంద కోట్లు ఖర్చుపెట్టించి, దాన్ని తిరిగి రెట్టింపు లాభాలతో వెనక్కి తీసుకొచ్చే సత్తా కొద్దిమంది దర్శకులకే ఉంటుంది. దానికి ఓ పెద్ద ప్లానింగ్ కావాలి. పద్ధతిప్రకారం ప్రమోషన్ కల్పించాలి. కొత్త మార్కెట్లలో కూడా అవకాశాలు పెంచుకోవాలి. బాహుబలి టీం చేస్తోంది అదే.

మరి ఇంత స్కెచ్ ను యూవీ క్రియేషన్స్ బ్యానర్ అమలు చేయగలదా అంటే డౌటే. ప్రభాస్ తో చేయబోయే నెక్ట్స్ సినిమా కోసం వాళ్ల స్నేహితులు, చుట్టాలైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు వంద కోట్లు పెడుతున్నారనే టాక్ ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తోంది.వంద కోట్ల బడ్జెట్ తో సినిమా చేయడం గొప్పకాదు. దాన్ని ఓ రేంజ్ లో మార్కెట్ చేసుకొని తిరిగి లాభాలు పొందాలి. పైగా ఇక్కడ ఉన్నది రాజమౌళి కాదు. సుజిత్ అనే ఒక సినిమా అనుభవం ఉన్నకుర్రాడు. అటు ఈమధ్యే ఇండస్ట్రీలోకి ఎంటరైన నిర్మాతలు. వీళ్లంతా కలిసి ప్రభాస్ ను హీరోగా పెట్టి ఎంత వసూళ్లు సాధిస్తారనేది అందర్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Loading...

Leave a Reply

*