స్టూడెంట్ నెం.1 ఇంట‌ర్వెల్‌ సీన్‌.. వ‌ర్మ సినిమా కాపీ అట‌..!

varma-and-student-no1

రాజ‌మౌళి తొలి చిత్రం.. జ‌క్క‌న్న తొలి అడుగు.. తెలుగు చిత్ర‌సీమ‌లో రాజ‌మౌళి ప్ర‌స్థానం ప్రారంభ‌మై స‌రిగ్గా ప‌దిహేనేళ్లు. 2001లో ద‌ర్శ‌క‌ధీరుడి తొలి సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ 1. రాజ‌మౌళి విజయ ప్ర‌స్థానం ఇక్క‌డి నుంచే ప్రారంభ‌మైంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి హిట్‌. తార‌క్‌-రాజ‌మౌళిక కాంబినేష‌న్‌లోనూ ఇదే మొద‌టి చిత్రం. ఆ త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు వ‌చ్చినా.. తొలి అడుగు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.

అయితే, స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌తోనే రాజ‌మౌళి.. త‌న ట్రేడ్‌ మార్క్ చూపించ‌డం మొద‌లుపెట్టాడు. అదే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ని డీల్ చెయ్య‌డంలో జ‌క్క‌న్న‌కు స్పెషాలిటీని తీసుకువ‌చ్చింది ఇక్క‌డి నుంచే. నేను ఎక్కడినుంచి కాలేజ్‌కి వస్తున్నానో తెలుసా.. జైలు నుంచి రా.. ! ఈ ఒక్క ఎమోష‌న‌ల్‌, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరుగుతాయి. అక్క‌డి నుంచి క‌థ‌పై ప్రేక్ష‌కుడు సెకండాఫ్‌లో ఏం జ‌రుగుతుందో అనే క్యూరియాసిటీతో చూసేలా చేస్తోంది. ఇదే ఆ త‌ర్వాత త‌న సింబ‌ల్‌గా, స్పెష‌ల్‌గా మారింది. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ త‌ర్వాత వ‌చ్చిన సింహాద్రి, సై, ఛ‌త్ర‌ప‌తి, మ‌గ‌ధీర‌, ఈగ, విక్ర‌మార్కుడు.. ఇలా ప్ర‌తి మూవీలోనూ ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోయేలా చూసుకుంటున్నాడు జ‌క్క‌న్న.

స్టూడెంట్ నెంబ‌ర్ 1 ఇంట‌ర్‌వెల్ సీన్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ మూవీ ప్రభావం వుంటుంది. ఈ మాట మ‌నం చెప్ప‌డం కాదు.. స్వ‌యంగా రాజ‌మౌళినే అంగీక‌రించాడు. వ‌ర్మ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం శివ‌లోని కాలేజ్ ఫైట్‌ని చూసి ఇన్‌స్ప‌యిర్ అయి స్టూడెంట్ నెంబ‌ర్ 1 ఇంట‌ర్‌వెల్ సీన్‌ని తెర‌కెక్కించాడ‌ట‌. శివ‌లో హీరో విల‌న్ గ్యాంగ్‌ను త‌రుముకుంటూ… కాలేజ్‌లోనే కొడ‌తాడు. స్టూడెంట్ నెం.1లోనూ సేమ్ సీన్ క‌నిపిస్తుంది. రాజీవ్ క‌న‌కాల గ్యాంగ్‌ని కాలేజ్ మొత్తం తిప్పుతూ కొడ‌తాడు. ఈ ఫైట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది కూడా రాజ‌మౌళియేన‌ట‌. దీనిని కూడా ఆయ‌నే చెప్పాడు. ఇలా, కొన్ని సినిమాల‌లోని సీన్‌ల‌ను కాపీ కొడ‌తాడ‌నే ఉద్దేశ్యంతోనే ఆయ‌న‌ను కొందరు కాపీ మాస్ట‌ర్ అనే విమ‌ర్శ ఉంది. కానీ, వాటిని ప‌క్క‌న‌పెడితే.. రాజ‌మౌళి దేశ‌మే గ‌ర్వించ‌ద‌గిన ద‌ర్శ‌కుడిగా అవ‌త‌రించాడు.

 

Loading...

Leave a Reply

*