ఒకే సినిమాలో ముగ్గురు స్టార్స్ గెస్ట్ రోల్స్

heros

హీరోలు గెస్ట్ రోల్స్ చేయడం కామనే. అయితే ఒకేసారి స్టార్ హీరోలు ముగ్గురు గెస్ట్ రోల్స్ చేయడం మాత్రం కాస్త కొత్తగానే చెప్పుకోవాలి. నాగచైతన్య నటిస్తున్న ప్రేమమ్ సినిమలో వెంకటేశ్, నాగార్జున గెస్ట్ రోల్స్ చేశారు. ఇదికాకుండా.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఓ సినిమాలో ఏకంగా ముగ్గురు యంగ్ స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారట. వాళ్లే ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్ చరణ్.స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా త్వరలోనే సావిత్రి అనే సినిమా రానుంది. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో లీడ్ రోల్ చేసేందుకు నిత్యామీనన్ అంగీకరించింది.

ఈ సినిమాలోనే నాగచైతన్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.గాసిప్స్ కు పెట్టింది పేరు అశ్వనీదత్. మహేష్ తో సినిమా ఉందని ఒకసారి, పవన్ కల్యాణ్ తో మూవీ అని మరోసారి ఇలా లీకులు ఇవ్వడం అశ్వనీదత్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు సావిత్రి ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా పరంగా చూస్తే… అలనాటి మేటి నటి సావిత్రి… అక్కినేని, ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ తో నటించింది. ఆ పాత్రలను ఇప్పటి ఎన్టీఆర్, నాగచైతన్య లాంటి హీరోలతో చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత.

Loading...

Leave a Reply

*