పృధ్వీపై వేధింపుల కేసు వెనుక‌ ఆ బ‌డా క‌మెడియ‌న్‌..?

p1

పృధ్వీ.. అంటే గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటే అంద‌రికీ బాగా సుప‌రిచితం. ఆ ఒక్క డైలాగ్‌తో ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయ‌నపై ఎప్పుడూ లేనిది ఓ వివాదం చుట్టుముట్టింది. అదీ ఓ మ‌హిళ త‌న‌ను పృధ్వీ పెళ్లి చేసుకొని వేధిస్తున్నాడ‌ని.. వ‌ర‌క‌ట్న‌పు కేసు పెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయ‌న సిటీలో లేరు. ఓ సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ లొకేష‌న్‌ల‌లో ఉన్నారు. దీనిపై స్పందించిన ఆయ‌న‌.. ఆమె ఒక‌ప్పుడు త‌న ఇంట్లో ప‌నిమ‌నిషిగా చేసింద‌ని, ఆమె భ‌ర్త కూడా త‌న ఇంట్లోనే ప‌ని చేశాడ‌ని, అయితే వాళ్లిద్ద‌రూ ఎందుకు ఇలా చేశారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని వాపోయార‌ట‌. ముఖ్యంగా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సినిమా విడుద‌లయిన ద‌గ్గ‌ర‌నుంచి త‌న‌కు వార్నింగ్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వివ‌రించార‌ని స‌మాచారం.

త‌నకు కొన్నాళ్లుగా బెదిరింపు కాల్స్‌, వార్నింగ్స్ వ‌స్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, చివ‌రికి ఇలా బుక్ చేస్తార‌ని అస‌లు ఊహించ‌లేద‌ని బాధ‌ప‌డ్డాడ‌ట‌. అయితే, ఎదిగేట‌ప్పుడు ఒదిగి ఉండ‌డం ఏంటో తెలుసుకున్న పృధ్వీ ప్ర‌స్తుతం ఈ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్నాడు. ఈ కేసు వెనుక ఓ బ‌డా క‌మెడియ‌న్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. నిన్న‌మొన్న‌టిదాకా టాలీవుడ్‌లో టాప్ హీరోల చాన్స్‌ల‌న్నీ ద‌క్కించుకున్న ఆయ‌న‌కి పృధ్వీ రూపంలో ఇటీవ‌ల చెక్ ప‌డింద‌ట‌. దీంతో, ఫ్యూచ‌ర్ స్టార్‌ని కావాల‌నే కార్న‌ర్ చేశాడ‌ని చెప్పుకుంటున్నారు సినీ జ‌నాలు. పృధ్వీ కెరీర్‌ని ట్రాక్ త‌ప్పిస్తే చాన్స్‌లు పెరుగుతాయ‌ని భావించిన ఆ స్టార్ క‌మెడియ‌న్‌.. ఇలా చేశాడ‌నే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ కేసు నుంచి పృధ్వీ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*