నాగ్ ఈసారైనా ఛాన్స్ ఇస్తాడా…?

untitled-6

గతంలో నాగార్జునతో కింగ్ అనే సినిమా చేశాడు శ్రీనువైట్ల. ఆ పరిచయంతో ఎప్పటికప్పుడు మన్మధుడికి స్టోరీలు వినిపిస్తూనే ఉంటాడు. కానీ నాగ్ మాత్రం ఈమధ్య కాలంలో శ్రీనువైట్లను ఎంటర్ టైన్ చేయలేదు. గతంలో బ్రూస్ లీ, ఆగడు లాంటి భారీ డిజాస్టర్లు ఇచ్చిన వైట్లకు మళ్లీ అవకాశం ఇవ్వడానికి నాగార్జునకు మనసు ఒప్పలేదు. అందుకే గతంలో అఖిల్ రెండో సినిమాకు శ్రీనువైట్లను అనుకొని ఆఖరి నిమిషంలో అతడ్ని తప్పించారు. ఇప్పుడు తాజాగా లిస్ట్ లోకి నాగచైతన్య కూడా చేరాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ తో మిస్టర్ అనే సినిమా చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు వచ్చింది . ఈ గ్యాప్ లో మరోసారి నాగార్జునను కలిశాడట వైట్ల. మరో స్టోరీ వినిపించాడట. నాగచైతన్యకు అయితే ఈ స్టోరీ చాలా బాగుంటుందని కూడా సూచించాడట. ఈసారి మాత్రం నాగార్జునకు వైట్ల స్టోరీ నచ్చిందని తెలుస్తోంది. కుదిరితే నాగచైతన్యకు ఆ స్టోరీని అప్పగించాలని అనుకుంటున్నాడట. అయితే చైతన్య ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న.

ఈమధ్య కాలంలో సినిమాలకు సంబంధించి తనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు చైతూ. ప్రేమమ్ రీమేక్ లో నటించాలనే నిర్ణయం కూడా అతడిదే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా కూడా సొంత నిర్ణయమే. మరి ఇలాంటి టైమ్ లో నాగార్జున చెప్పాడని, ఫ్లాప్ దర్శకుడితో చైతూ సినిమాకు కమిట్ అవుతాడా అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*