మరోసారి ప్రత్యేక పూజలు…

untitled-4

చిరు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. చిరు కుటుంబసభ్యులో, యూనిట్ సభ్యులో ఎవరో ఒకరు పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లేముందు కూడా ఇలాంటి ప్రత్యేక పూజల హంగామా చాలానే చూశాం. ఇప్పుడు చిరు సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకున్న టైమ్ లో మరోసారి పూజల వ్యవహారం తెరపైకి వచ్చింది.

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి దేశంలోని 6 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ దేవాలయాలు ఏంటనే విషయాన్ని మాత్రం ఇంకా నిర్థారించలేదు. వీటిలో 2 దేవాలయాలు మాత్రం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒకటి తిరుపతి, రెండు వారణాసి అని తెలుస్తోంది. ఈ రెండు దేవాలయాలతో పాటు మరో 4 ప్రముఖ ఆలయాల్లో చిరు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. ఈ పూజల్ని చిరు కుటుంబ సభ్యులే దగ్గరుండి జరిపిస్తారని తెలుస్తోంది.

అయితే అంతా సాఫీగా సాగిపోతున్న ఈ సమయంలో మరోసారి పూజలు ఎందుకు నిర్వహించబోతున్నారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీనికి కూడా ఓ రీజన్ చెబుతున్నారు. త్వరలోనే చిరు 150వ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారట. అందుకే ఇలా ప్రత్యేక పూజలతో హంగామా చేస్తున్నట్టు సమాచారం.

Loading...

Leave a Reply

*