వెరైటీ సెంటిమెంట్ తో కొడుతున్నారు…

surya

సూర్యపై ఇప్పుడో వెరైటీ ప్రచారం మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ఇది కచ్చితంగా అతడి కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసే ప్రచారమే. ప్రత్యర్థుల పన్నాగమే అని అనుకోవాలి. అవును.. ఓ బ్యాడ్ సెంటిమెంట్ ను ఇప్పుడు బయటకు తీసి సూర్యపై వదులుతున్నారు. ఆ బురదను సూర్యకు అంటించడానికి సోషల్ మీడియా ద్వారా తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా బ్యాడ్ సెంటిమెంట్. అది నిజంగానే సూర్య కెరీర్ కు దెబ్బ కొడుతుందా… సూర్య ఈసారి ఫ్లాప్ అందుకుంటాడా…

సూర్య సినిమా టైటిల్స్ లో అంకెలుంటే మూవీ ఢమాల్ అనేది ఆ కొత్త సెంటిమెంట్. సెవెన్త్ సెన్స్ సినిమాలో 7 అనే నంబర్ ఉంది. కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అయింది. తాజాగా 24 అనే సినిమా చేశాడు సూర్య. అది కూడా ఓ సంఖ్య. కాబట్టి ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. పసంగే-2 అనే సినిమా చేశాడు. అది కూడా ఫ్లాప్. అంతెందుకు అప్పుడెప్పుడో 6 అనే సినిమా చేశాడు. అది కూడా ఫ్లాప్ అయింది. సో.. ఇప్పుడు సింగం-3 అనే టైటిల్ తో వస్తున్న సూర్య తప్పకుండా ఫ్లాప్ తెచ్చుకుంటాడని ఓ సెక్షన్ వాదిస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ బ్యాడ్ సెంటిమెంట్ తో సూర్య ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను ఎలా అడ్డుకోవాలో తెలీక జుట్టుపీక్కుంటున్నారు. నిజానికి సింగం-2 సినిమా సక్సెస్ అయింది. కానీ తొలిభాగం సింగంతో పోలిస్తే అది ఆశించిన మేర విజయవంతం కాలేదు. సో.. ఈ యాంగిల్ లో కూడా సూర్యకు నిద్రలేకుండా చేస్తున్నారు కొందరు.

Loading...

Leave a Reply

*