నా భ‌ర్తలో విల‌న్ ల‌క్ష‌ణాలున్నాయి.. సిమ్రాన్‌…!

simran

సిమ్రాన్ గుర్తుందా..? 90ల‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచింది ఈ భామ‌. ఇలియానాకి ముందు… విజ‌య‌శాంతి త‌ర్వాత, సౌంద‌ర్యతో క‌లిసి టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన క‌థానాయిక. చిరంజీవి నుంచి వెంకీ దాకా అంద‌రు టాప్ హీరోల‌తోనూ న‌టించింది. స‌మ‌ర‌సింహారెడ్డి, క‌లిసుందాం రా, డాడీ, నువ్వు వ‌స్తావని వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించింది సిమ్రాన్‌. నాజూకు న‌డుము అందాల‌కు అప్ప‌ట్లో ఆమె ఫేమ‌స్‌. ఇటు, యువ‌రాజులో మ‌హేష్ స‌ర‌స‌న కూడా జోడీ క‌ట్టింది ఈ బ్యూటీ. ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుండ‌గానే పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల‌యింది సిమ్రాన్‌.ఇటీవ‌ల ఆమె రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమాలు అంత‌గా ఆడ‌లేదు. ఇటు బుల్లితెర‌పైనా ప‌లు రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. అక్క‌డ ఆమె స‌రైన సక్సెస్ అందుకోలేదు. దీంతో, ఆమె త‌న భ‌ర్త‌ని విల‌న్‌గా సౌత్‌కి ప‌రిచయం చేస్తానంటోంది.

త‌న భ‌ర్త దీప‌క్ రీల్ విల‌న్‌గా ప‌నికొస్తాడ‌ని కాన్‌ఫిడెంట్‌గా చెబుతోంది. అంతేకాదు, త‌నకు ప‌రిచ‌యం ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత‌లంద‌రితోనూ త‌న హ‌బ్బీ ఫోటో షూట్‌లు, ఆల్బ‌మ్ షేర్ చేస్తోంద‌ట‌. ఆయ‌న‌లో న‌టుడ‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని చెబుతోంద‌ట‌. గ‌తంలో ఎయిర్‌లైన్స్‌లో ప‌నిచేసిన దీప‌క్‌.. తాజాగా త‌న భార్య ప‌రిచ‌యాల‌తో విల‌న్‌గా చాన్స్‌లు అందుకోవాల‌ని ఆశ ప‌డుతున్నాడ‌ట‌. అంతేకాదు, అప్పుడే ఓ ఆఫ‌ర్‌ని కూడా ద‌క్కించుకున్నాడ‌ట‌. కోలీవుడ్‌లో రూపొందుతున్న ఓడు రాజా ఓడు సినిమాలో దీప‌క్ బ‌గ్గాకి విలన్ రోల్ ఇచ్చారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. ఈ సినిమాతో దీప‌క్ త‌న టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటే.. మ‌రిన్ని చాన్స్‌లు వస్తాయ‌ని, ఇక తాను విల‌న్‌గా సెటిల‌వ్వొచ్చ‌ని ఆయ‌న‌కు ఉప‌దేశిస్తోంద‌ట సిమ్రాన్‌. మ‌రి, చాన్స్ ఇప్పించుకుందే స‌రే.. ఆయ‌న‌ను విల‌న్‌గా నిల‌బెడుతుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*