ఈసారి ఇలా అడ్డంగా దొరికిన శ్వేతాబ‌సు..!

seweyha

కొత్త‌బంగారు లోకం సినిమాతో తెలుగు తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మైన శ్వేతాబ‌సు త‌న వ‌రుడు నిర్ణ‌య‌మైపోయాడ‌ని అంటుంది. తాను డేటింగ్‌లో ఉన్నాన‌ని అయితే, పెళ్లి ఎప్పుడు చేసుకోవాల‌నుకునేది మాత్రం ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని చెప్పింది. ఎ.. కా.. డా.. అంటూ హొయ‌లు పోయిన ఈ ముద్దుగుమ్మ‌… ఆ త‌ర్వాత పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ‌డంతో అనూహ్యంగా తెలుగుతెర‌ను వీడిపోవాల్సి వ‌చ్చింది. దాంతో ముంబై చేరుకున్న శ్వేతాబ‌సు… హిందీ సీరియ‌ళ్ల‌లో బిజీ అయిపోయింది. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్కు త‌న‌ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో అవ‌కాశాలిస్తున్నారు. అక్క‌డే అమెకు రోహిత్ మిట్ట‌ల్ అనే వ‌ర్ధ‌మాన ఫిల్మ్ మేక‌ర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆ ప‌రిచ‌యం కాస్తా డేటింగ్‌కు దారి తీసింది. ఈ విష‌యంపై వార్త‌లు జోరందుకోవ‌డంతో ఈ బెంగాలీ బ్యూటీ నోరు విప్పారు. తాను రోహిత్‌తో డేటింగ్ ఉన్న‌ది నిజ‌మేన‌ని అంగీక‌రించారు. రెండేళ్ల నుంచీ త‌న‌తో రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తున్నాన‌ని తాము చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్పారు. అయితే, ఇంకా పెళ్లి గురించి ఆలోచించ‌లేద‌ని, అయితే, త‌మ పెళ్లి జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌క‌ముంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఫాంట‌మ్ ఫిల్మ్‌లో రోహిత్‌ను క‌లిశాన‌ని అప్ప‌టి నుంచి త‌మ ప్ర‌యాణం మొద‌లైంద‌ని శ్వేతాబ‌సు చెబుతున్నారు. ప్ర‌స్తుతం బ‌ద్రీనాథ్ కీ దుల్హ‌నియా అనే సీరియ‌ల్‌లో శ్వేతా కీల‌క‌పాత్ర పోషిస్తోంది.

Loading...

Leave a Reply

*