కాష్మోరా క‌లెక్ష‌న్లు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే..!

shocking-openings-for-karthi-kashmora

కార్తి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తున్నాడు. ఈ త‌మిళ్ హీరో తెలుగు మార్కెట్‌లోనూ దూసుకుపో్తున్నాడు. సూర్య బ్ర‌ద‌ర్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌న‌కంటూ ఓన్ ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని ద‌క్కించుకున్నాడు. అంతేకాదు, స్ట్ర‌యిట్ తెలుగు మూవీ ఊపిరిలోనూ న‌టించి త‌న మార్కెట్ అమాంతం పెంచుకున్నాడు. ఇప్పుడు తెలుగులో కార్తి మార్కెట్ ఓ రేంజ్‌లో ఉంది. ర‌వితేజ వంటి బ‌డా హీరోల‌తో పోటీ ప‌డే రేంజ్‌లో ఆయ‌న ఫాలోయింగ్ పెరిగింది. అది తాజాగా విడుద‌ల‌యిన కాష్మోరా విష‌యంలో ప్రూవ్ అయింది.

తొలి రోజు ఈ చిత్రం.. త‌మిళ్‌లో 4.5 కోట్లు కొల్ల‌గొట్టింది. టాలీవుడ్‌లోనూ అదే రేంజ్‌లో వ‌సూళ్లు పొంద‌డం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఈ చిత్రం తొలి రోజు.. ఏకంగా 4.5కోట్లు క‌లెక్ట్ చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ ఓపెనింగ్స్ ద‌క్కాయి. ఇటు బీ, సీ సెంట‌ర్‌ల‌లోనూ కాష్మోరాని చూసేందుకు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ్డారు. ఇటు ఓవ‌ర్సీస్‌లోనూ కాష్మోరాకి ఊహించ‌ని రెస్పాన్స్ ద‌క్కింది.

రెండో రోజు కూడా కాష్మోరా ప్ర‌భంజ‌నం ఏమాత్రం త‌గ్గ‌లేదు. డివైడ్ టాక్ వ‌చ్చింది. బాహుబ‌లికి బ్ర‌ద‌ర్‌… అరుంధ‌తికి కాపీ అనే కామెంట్స్ వినిపించినా.. కాష్మోరా థియేట‌ర్ల‌లో సంద‌డి ఏమాత్రం త‌గ్గ‌లేదు. హార‌ర్ కామెడీ కావ‌డం, ఇటు, ట్ర‌యిల‌ర్‌తోనే ఆస‌క్తిని రెయిజ్ చెయ్య‌డంలో ద‌ర్శ‌కుడు గోకుల్ స‌క్సెస్ అయ్యాడు. అందుకే, సెకండ్ డే కూడా ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టారు థియేట‌ర్ల‌కి. రెండో రోజు.. ఈ సినిమా దాదాపు మూడు కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. అంటే తొలి రెండు రోజులకే దాదాపు ఏడున్న‌ర కోట్లు. ఆదివారం దీపావ‌ళి.. ఇదే ఊపు పండ‌గ‌పూట‌ కూడా కొన‌సాగితే.. మ‌రో మూడు కోట్లు.. అంటే తొలి వీకెండ్‌కే దాదాపు 10 కోట్లు. రీసెంట్‌గా తెలుగు చిత్ర సీమ‌లో డ‌బ్బింగ్ సినిమాకి ఇదే ఓపెనింగ్స్ రికార్డ్‌. ర‌జ‌నీకాంత్‌, సూర్య‌, విజ‌య్ వంటి బ‌డా హీరోలు కూడా ఈ రేంజ్‌ని అందుకోలేక‌పోయారు. అంటే, ఊపిరి సినిమా కార్తికి బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్లుంది.

 

Loading...

Leave a Reply

*