బ్రహ్మి హీరో… అనసూయ హీరోయిన్…

ana

కాంబినేషన్ వింటుంటేనే గమ్మత్తుగా ఉంది కదా… తెరపై చూస్తే ఇంకా గమ్మత్తుగా ఉంటుందంటున్నారు. అవును… బ్రహ్మానందం హీరోగా, అనసూయ హీరోయిన్ గా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇదే కిర్రాక్ లాంటి వార్త అయితే.. ఈ సినిమాలో రష్మితో ఓ ఐటెంసాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారనేది పిచ్చెక్కించే న్యూస్. సింపుల్ గా చెప్పాలంటే జబర్దస్త్ భామలతో, హాస్యబ్రహ్మ ఆటపాట అన్నమాట. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం… బ్రహ్మీ హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన స్టోరీ కూడా రెడీ అయిపోయిందని, రేపోమాపో పూజా కార్యక్రమాలు జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఈ వార్తలు విని షాక్ అయ్యేలోపే మరో షాకింగ్ న్యూస్ కూడా సిద్ధంగా ఉంది కాచుకోండి.. ఈ ప్రాజెక్టుకు స్వయంగా బ్రహ్మానందం దర్శకత్వం వహిస్తారట. ఏంటి ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నాం అనుకుంటున్నారా… ప్రస్తుతానికైతే బ్రహ్మిపై షాకింప్ న్యూస్ లు ఇంతే. ఇవి ఎంత వరకు నిజమో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Loading...

Leave a Reply

*