షాకింగ్‌.. లెస్బియ‌న్ క‌థ‌లో న‌దియా..?

na

న‌దియా..ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. కేర‌క్ట‌ర్ రోల్స్‌కి కొత్త డెఫినెష‌న్ ఇచ్చిన ఈత‌రం సీనియ‌ర్ ఆర్టిస్ట్‌. మిర్చి సినిమాతో ప్రారంభమైన ఆమె హ‌వా.. ఆ త‌ర్వాత మ‌రింత పెరిగింది. ఇక‌, అత్తారింటికి దారేది, దృశ్యం, అ.. ఆ చిత్రాల‌తో అది పీక్‌కి చేరింది. అమ్మ‌, అత్త పాత్ర‌ల‌కు ఆవిడే కేరాఫ్‌గా మారింది. ఎంత‌గా అంటే.. కాస్త లెంగ్త్ ఉన్న రోల్ చెయ్యాలంటే న‌దియా ఏకంగా 50ల‌క్ష‌లు డిమాండ్ చేస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం అంత ఇచ్చుకోవ‌డానికి కూడా రెడీ అవుతున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఆమె క్రేజ్‌, గ్లామ‌ర్ అలాంటిది మ‌రి. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణతోపాటు పోటీగా ఉన్న సీనియ‌ర్ కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ అంటే న‌దియానే.

హుందా అయిన న‌ట‌న‌, సింపుల్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, నిండైన రూపంతో ఇట్టే క‌డిప‌డేస్తుంది న‌దియా.అయితే, నదియా రీసెంట్‌గా ఓ సినిమాకి సైన్ చేసింద‌ట‌. త‌మిళ్‌-మ‌ల‌యాళంలో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది ఈ మూవీ. ఇది క్రైమ్ థ్రిల్ల‌ర్ అట‌. అతీంద్రియ శ‌క్తుల బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంద‌ట‌. ముగ్గురు హీరోయిన్‌ల క‌థ ఇది. ఇనియా, ఆర్తి, కోవై స‌ర‌ళతో న‌దియా కూడా న‌టిస్తోంది ఈ మూవీలో. హాస్ట‌ల్‌లో ఉండే ముగ్గురు అమ్మాయిలు ఓ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం అడ‌విలో ఎంట‌ర్ అవుతారు.

అక్క‌డ ఉన్న ఒక అతీంద్రియ‌ శ‌క్తి వారిలో ఒక అమ్మాయిని చంపుతుంది.ఈ సినిమాలో న‌దియా ఆ అతీంద్రియ శ‌క్తుల వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించే పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోంది. అయితే, ఈ మూవీలో ఆ ముగ్గురు అమ్మాయిల‌లో ఇద్ద‌రి మ‌ధ్య హాట్ సీన్స్ ఉన్నాయ‌ట‌. అవి లెస్బియ‌న్ సీన్‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌వ‌ట‌. సినిమాలో అదే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ అని భావిస్తున్నారు. మ‌రి, ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*