యాంక‌ర్ లాస్య గురించి షాకింగ్ వాస్త‌వాలు..!

lasya

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా అడుగుపెట్టి.. ప‌ర్లేద‌నిపించుకుంది లాస్య‌. శ్రీముఖి, అన‌సూయ‌, రేష్మి రేంజ్‌లో స్టార్‌డ‌మ్ రాక‌పోయినా.. ఓ మోస్త‌రు పాపులారిటీ ద‌క్కించుకుంది. స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌, ఢీ జూనియ‌ర్స్‌, అంకితం, మొండిమొగుడు-పెంకి పెళ్లాం వంటి షోల‌తో తెలుగునాట యాంక‌ర్‌గా సెటిల‌యింది. హాట్ యాంక‌ర్‌గా కంటే.. హోమ్‌లీ గాళ్ అనే ఇమేజ్‌తో స‌రిపెట్టుకుంది. అయితే, ఈ అమ్మ‌డు గురించి తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. రెయిజింగ్ హీరో రాజ్‌త‌రుణ్‌ని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏకంగా కొంద‌ర‌యితే  ఇదిగో సాక్ష్యం అంటూ ఫోటోలు కూడా పెడుతున్నారు.

యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించ‌డానికి ముందు ఆమె గూగుల్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిన‌ట‌. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన ఆమెకు ఆ త‌ర్వాత గూగుల్ వంటి ప్రిస్టీజియ‌స్ సంస్థ‌లో ఉద్యోగం వ‌చ్చింద‌ట‌. అది కాంప‌స్ రిక్రూట్‌మెంట్‌నా లేక వాక్ ఇన్‌లో వ‌చ్చిందా అనేది క్లారిటీ లేదు. గూగుల్ లాంటి సంస్థ‌లో జాబ్ ద‌క్కించుకోవ‌డం అంటే మాట‌లుకాదు. హై క్వాలిఫికేష‌న్‌తోపాటు ఇంగ్లీష్‌, అర్ధ‌మేటిక్‌, రీజ‌నింగ్‌, క్రియేటివిటీ వంటి అంశాల‌లో చాలా మెరుగ్గా ఉండాలి. ఇక టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీలోనూ మంచి ప‌ర్సంటేజ్‌లు వచ్చి ఉండాలి. యాంక‌రింగ్ మీద మ‌క్కువ‌తో గూగుల్ జాబ్‌ని వ‌దిలేసి వ‌చ్చాన‌ని చెప్పింది లాస్య‌.

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అయిదేళ్లు అయింద‌ట‌. అయితే, ఇటు, సోష‌ల్ మీడియాలో రాజ్‌త‌రుణ్‌తో వివాహం జ‌రిగిందంటూ ఓ గాసిప్ షికారు చేస్తుండ‌గానే.. నిన్న భీమ‌వ‌రంలో ఓ ఫంక్ష‌న్‌కి హాజ‌ర‌యిన లాస్య‌.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకొని ఇల్లాలిగా సెటిల‌వుతాన‌ని చెప్పింది. అంటే, ఇప్ప‌టికే రాజ్‌త‌రుణ్‌తో సీక్రెట్‌ మ్యారేజ్ అయింద‌ని క్లారిటీ వ‌చ్చింద‌ని, అస‌లు విష‌యాన్ని రేపో మాపో రివీల్ చేస్తార‌ని కొంద‌రంటున్నారు. ఏది నిజ‌మో తేలాలంటే.. ఇద్దరిలో ఒక‌రు మౌనం వీడితేకానీ, స‌మాధానం రాదు.

Loading...

Leave a Reply

*