ప్ర‌భాస్‌కి అంత సీన్ లేదు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

prabhas-raj

బాహుబ‌లితో ప్ర‌భాస్ మార్కెట్ ఏ రేంజ్‌లో పెరిగిందో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. నేష‌నల్ వైడ్ పాపులారిటీ వ‌చ్చింది. ఆయన‌కు ఇప్పుడు తెలుగుతోపాటు త‌మిళ్‌, మ‌లయాళం, హిందీలోనూ సూప‌ర్ మార్కెట్ దొరికింది. అందుకే, బాహుబ‌లి హీరోకి జాతీయ స్థాయిలో యాడ్‌లు వ‌స్తున్నాయి. ఇటు తాజాగా టుస్సాడ్ మ్యూజియంలో ఆయ‌న మైన‌పు బొమ్మ‌ను కూడా పెడుతున్నారు. ఇది ఓ రికార్డ్‌. సౌత్‌లో ఇంత‌వ‌రకు ఈ హీరోకి ద‌క్క‌ని అరుదైన గౌర‌వం ఇది.

ఛ‌త్ర‌ప‌తి గ్రాఫ్ ఈ రేంజ్‌లో పెరుగుతుంటే.. మ‌రోవైపు, ఆయ‌న మార్కెట్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ ర‌న్ రాజా రన్ ద‌ర్శ‌కుడి ఫేమ్ సుజిత్‌తో ఓ మూవీకి సైన్ చేస్తున్నాడు. ఈ సినిమాని మ‌ల‌యాళం, త‌మిళ్‌తోపాటు హిందీలోనూ ఒకేసారి బాహుబ‌లి రేంజ్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ప్ర‌భాస్‌కి అంత సీన్ లేద‌ని, ఇప్ప‌టిదాకా వచ్చిన‌దంతా రాజ‌మౌళి మాయాజాలం అని, బాహుబ‌లి 2 త‌ర్వాత ఆయ‌న సినిమాల‌కు తెలుగు మిన‌హా మ‌రో భాష‌లో ఆడ‌వ‌ని కొంద‌రు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

దీనిపై, ప్ర‌భాస్ అభిమానులతోపాటు మ‌రికొంద‌రు మండిప‌డుతున్నారు. నార్త్‌లో రీసెంట్‌గా డ‌బ్ చేసిన మిర్చి, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్, డార్లింగ్ లాంటి చిత్రాల‌కు మంచి టీఆర్‌పీలు వ‌స్తున్నాయని.. బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి మార్కెట్ పెరిగింద‌న‌డంలో ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏమికావాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు, ప్ర‌భాస్ క్రేజ్‌, ఫేస్ వేల్యూ చూసే రీసెంట్‌గా ఓ కార్పొరేట్ సంస్థ యాడ్ కోసం సైన్ చెయ్య‌డానికి ముందుకు వ‌చ్చినా.. ప్రభాస్ వెన‌క్కి తగ్గాడ‌ని చెబుతున్నారు. మొత్త‌మ్మీద‌, బాహుబ‌లిని ప‌క్క‌న పెట్టినా ఛ‌త్ర‌ప‌తి ఇప్పుడు మ‌హేష్ త‌ర్వాత నార్త్ లోనూ పాపుల‌ర్ అయిన సౌత్ హీరో అని చెప్పొచ్చు.

Loading...

Leave a Reply

*