ర‌ష్మీపై వ్య‌భిచారం ఆరోప‌ణ‌లు..!

reshmi

బుల్లితెర యాంక‌ర్‌గానే హీరోయిన్‌ల రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న అతికొద్ది మంది స్టార్ యాంక‌ర్‌ల‌లో ఒక‌రు ర‌ష్మి. కేర‌క్ట‌ర్ రోల్స్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. అక్క‌డ స‌రైన పాపులారిటీ రాకపోవ‌డంతో స్మాల్ స్క్రీన్‌వైపు అడుగులు వేసింది. ఇక్క‌డ మాత్రం ఆమెకు త‌క్కువ టైమ్‌లోనే ఊహించ‌ని ఫేమ్ ద‌క్కింది. వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ, చిట్టి పొట్టి షార్ట్ డ్ర‌స్‌ల‌తో కుర్ర‌కారును ఊపేసింది. ఇదే ఆమెకు టాలీవుడ్‌లో రీ ఎంట్రీని షురూ చేసేలా చేసింది.

గుంటూరు టాకీస్‌తో బుల్లితెర‌పై సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ర‌ష్మీ.. గుంటూరు టాకీస్‌లో అందాల ఆర‌బోత‌తో అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత మ‌రికొన్ని చిత్రాల‌లో నటించినా స‌రైన పాత్ర‌లు రాలేదు. కేవ‌లం ఆమె గ్లామ‌ర్ షోకే ప‌రిమిత‌మ‌యింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీనిపై ఏకంగా ఆమె అభిమానే ప్ర‌శ్నించాడు. దానిని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసింద‌నుకోండి.

తాజాగా ఆమె త‌ను వ‌చ్చెనంట‌ మూవీతో ఆడియెన్స్ ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి అంత పాజిటివ్ రాలేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌న్ అవుతున్నా.. స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు ఈ మూవీకి. అయితే, గుంటూరు టాకీస్ త‌ర్వాత త‌న‌కు ఐటెం సాంగ్‌లు చెయ్య‌మ‌ని భారీగా ఆఫ‌ర్‌లు వ‌స్తున్నా.. రిజెక్ట్ చేస్తున్నాన‌ని తెలిపింది. కేవ‌లం బ‌డా సినిమాల ఆఫ‌ర్‌లు రాక‌పోవ‌డంతోనే వాటిని రిజెక్ట్ చేస్తున్నాన‌ని తెలిపింది.

ఇక సుడిగాలి సుధీర్‌కు త‌నకు ఎఫైర్ ఉంద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించిన ఆమె త‌మ ఇద్ద‌రి గురించి ఎన్ని గాసిప్పులైనా రాసుకోండ‌ని స్ట్ర‌యిట్‌గానే చెబుతోంది. అలాగైనా త‌న‌కు బాగా ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని అంటోంది. ఇక తనపై వచ్చిన వ్యభిచారం ఆరోపణలు త‌న‌ను చాలా బాగా బాధ‌పెట్టాయ‌ని… ఆ నింద‌ను తాను మోయ‌లేక‌పోయాన‌ని వాపోయింది ఈ హాట్ యాంక‌ర్ కమ్‌ హీరోయిన్‌.

Loading...

Leave a Reply

*