విశాల్‌కి త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ షాక్‌.. నిషేధం వేటు…!

untitled-4

విశాల్‌కి త‌మిళ్ చిత్ర ప‌రిశ్రమ నిర్మాత‌ల మండ‌లి గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఆయ‌న సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతున్న టైమ్‌లో ఆయ‌న స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది. న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న విశాల్‌కు ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఆయ‌న సొంత బ్యాన‌ర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ స‌భ్య‌త్వాన్ని తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది త‌మిళ నిర్మాత‌ల మండ‌లి.

రీసెంట్‌గా ఓ ప‌త్రిక‌క‌కు విశాల్ ఇంట‌ర్‌వ్యూ ఇచ్చాడు. ఆ ఇంట‌ర్‌వ్యూలో నిర్మాత‌ల మండ‌లిపై విశాల్ కొన్ని కామెంట్‌లు చేశాడు. పైర‌సీని కంట్రోల్ చెయ్య‌డంలో నిర్మాత‌ల మండలి పూర్తిగా విఫ‌ల‌మ‌యిందని, వారు ఏం చేద్దామ‌న్నా ముందుకు రావ‌డం లేద‌ని ఆరోపించారు. దీంతో, ఆయ‌న‌పై చ‌ర్య‌కు పాల్ప‌డింది టీఎఫ్‌పీసీ. ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైనవి అని భావించిన టీఎఫ్‌పీసీ నోటీసులు జారీ చేసింది. విశాల్‌ని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చినా.. లైట్ తీసుకుంది. స‌రిగా లేద‌ని, మ‌రింత క్లియ‌ర్‌గా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలిపింది. అంత‌కుముందే, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీతోపాటు నిర్మాత‌గా విశాల్ మెంబ‌ర్ షిప్‌పైనా నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలుగా విడిపోయింది. అటు శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం, ఇటు విశాల్ గ్రూప్ రెండూ రెండు గ్రూప్‌లుగా విడిపోయాయి. దీంతో, చిన్న చిన్న వివాదాలే వ్య‌క్తిగ‌తంగా మారుతున్నాయి. మ‌రి, ఈ స‌మ‌స్య‌కు ఎలాంటి ప‌రిష్కారం ల‌భిస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*