కుర్రాడు మరో హిట్ కొట్టేట్టు కనిపిస్తున్నాడు..

sharwanad

స్లో పాయిజన్ అనే పదానికి సిసలైన ఎగ్జాంపుల్ గా మారాడు శర్వానంద్. థియేటర్లలోకి ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా అనే సింగిల్ ఎజెండాతో దూసుకుపోతున్నాడు. ఓ మోస్తరు హీరోలే రంగంలోకి దిగడానికి భయపడే దసరా సీజన్ లో అలవోకగా అడుగుపెడుతూ… అదే స్థాయిలో సక్సెస్ కూడా అందుకుంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో థియేటర్లలోకి వచ్చిన శర్వానంద్… ఎన్టీఆర్, బాలయ్య,నాగార్జున లాంటి స్టార్లతో పోటీపడి మరీ హిట్ అందుకున్నాడు.

ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అయిపోతున్నాడు శర్వ. శతమానం భవతి అనే సినిమాను వచ్చే సంక్రాంతికి సిద్ధంచేశాడు. దసరా సందర్భంగా సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ సంక్రాంతి కంటే వచ్చే సంక్రాంతికి ఇంకా పెద్ద పోటీ కనిపిస్తోంది. బడా బాబులు చిరంజీవి, బాలయ్య ఇద్దరూ పోటీకి సై అంటున్నారు. ఇలాంటి టఫ్ కాంపిటిషన్ లో కూడా ఏమాత్రం బెదరట్లేదు శర్వ. తన సినిమా కూడా సంక్రాంతికే అంటూ ప్రకటించేశాడు.

శతమానం భవతి టీజర్ చూస్తుంటే.. శర్వ ఈసారి కూడా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్ చాలా రీఫ్రెషింగ్ గా ఉంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కు రావాల్సిన సరైన సినిమాలా ఇది కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఎలాగైతే సోగ్గాడు సినిమా జానర్ పరంగా పర్ ఫెక్ట్ మూవీ అనిపించుకుందో… వచ్చే సంక్రాంతికి శతమానం సినిమా కూడా జానర్ పరంగా పర్ ఫెక్ట్ అనిపించుకుంటోంది.

Loading...

Leave a Reply

*