చెర్రీ తోడ‌ల్లుడు కానున్న శ‌ర్వానంద్‌.. అపోలో ఫ్యామిలీతో వియ్యం…!

ram-charan

రామ్‌చ‌ర‌ణ్‌.. శ‌ర్వానంద్ మంచి ఫ్రెండ్స్‌. చిన్ననాటి స్నేహితులు. ఇద్ద‌రూ ఒకే స్కూల్‌లో చ‌దువుకున్నారు. చిన్న‌నాటి నుంచే ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ట‌. చెర్రీ క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ‌ర్వానంద్ ఒక‌డు. అయితే, ఈ ఇద్ద‌రూ త్వ‌రలోనే తోడ‌ల్లుళ్లుగా మార‌నున్నార‌నే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అపోలో వ్య‌వ‌స్థాప‌కులు, సీసీ రెడ్డి మ‌న‌వ‌రాలిని రామ్‌చ‌ర‌ణ్ వివాహం చేసుకున్నారు. ఉపాస‌నకు ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు. వారిలో ఒక‌రిని శ‌ర్వానంద్‌కి ఇచ్చి వివాహం చెయ్యాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట కామినేని శోభ‌న కుటుంబం. ఇప్ప‌టికే, దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి పెద్ద‌లు మాట్లాడుకోవ‌డం కూడా జ‌రిగింద‌ని, త్వ‌రలోనే ఓ మాట ద్వారా ఫైన‌లైజ్ చెయ్య‌డ‌మే అని తెలుస్తోంది.

శ‌ర్వానంద్‌ది విజ‌య‌వాడ‌. ఆయ‌నకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంద‌ని స‌మాచారం. ఆర్థికంగా వారి కుటుంబం బాగా సెటిల‌యింద‌ని, శ‌ర్వానంద్ తండ్రి మంచి బిజినెస్ మేగ్న‌ట్ అని.. అందుకే, ఈ మ్యారేజ్‌కి ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటు, సీసీ రెడ్డి కుటుంబం గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక‌, శ‌ర్వానంద్ మ్యారేజ్‌కి రామ్‌చ‌ర‌ణ్ రిక‌మండేష‌న్ ఉండ‌నే ఉంది. ఇంకేముంది.. దాదాపు ఈ ఇద్ద‌రూ ఇక కో బ్ర‌ద‌ర్స్‌కావ‌డ‌మే మిగిలి ఉంది అనే రేంజ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*