కాజ‌ల్‌పై మండిప‌డ్డ ఆమెను వాడుకొని వ‌దిలేసిన హీరో…?

kajal

రీసెంట్‌గా కాజ‌ల్ త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పిన మాట చిలికి చిలికి గాలివాన‌గా మారేలా ఉంది. గ‌తంలో బాలీవుడ్‌ హీరో షాహిద్ క‌పూర్ త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడ‌నే కామెంట్స్ చేసింది. త‌న‌తో క‌లిసి సినిమా చేసే టైమ్‌లో త‌న కారు వాడుకొని వ‌దిలేశాడ‌ని ఆమె వ్యాఖ్యానించింద‌ట‌.

ఈ కామెంట్స్ రీసెంట్‌గా షాహిద్ క‌పూర్‌కి చేరాయ‌ట‌. దీనిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ని స‌మాచారం. కాజల్‌ని అడిగే కారు తీసుకొని వాడుకున్నాన‌ని.. త‌న‌కు చెప్ప‌కుండా ఏమీ చెయ్య‌లేద‌ని, త‌నతో సినిమా చెయ్య‌డానికి రెడీ అయ్యాన‌ని, కానీ, అంత‌లోనే అది ఆగిపోయింద‌ని చెప్పాడ‌ట‌. అలా ఆగిపోయిన త‌ర్వాత ఆమెతో ట‌చ్‌లేని మాట వాస్త‌వ‌మే అని అంగీక‌రించాడ‌ట‌. సినిమా అయిపోయిన త‌ర్వాత మ‌రోసారి అదే హీరోయిన్‌తో ప‌దే ప‌దే మాట్లాడ‌డం బావుంటుందా..? మ‌రి, కాజ‌ల్ ఎందుకిలా వ్యాఖ్యానించిందో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించాడ‌ట‌. చిన్న వ్య‌వ‌హారాన్ని కాజ‌ల్ ర‌చ్చ చేస్తోంద‌ని కూడా రుస‌రుస‌లాడాడ‌ట. మ‌రి, షాహిద్ వ్యాఖ్య‌ల‌పై కాజ‌ల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*