కాజల్ ను మోసం చేసిన స్టార్ హీరో…?

kajal

ఇది మామూలుగా చెప్పుకునే వార్త కాదు. నిజంగానే కాజల్ ను ఆ హీరో మోసం చేశాడట. అవకాశం ఇప్పిస్తానని తెగ తిప్పించుకొని చివరికి హ్యాండ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా కాజలే తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని తెగ బాధపడిపోతోందట. తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇటీవల ఆమె తన స్నేహితులతో ఓ హీరో గురించి ఫిర్యాదు చేస్తూ వాపోయినట్టు ఫిల్మ్‌నగర్ టాక్.తన లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్న ఓ హీరో తనను సడెన్‌గా దూరం పెట్టాడని టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ తెగ బాధపడిపోతోంది.

బాలీవుడ్‌లో అవకాశాల కోసం చేసిన ప్రయత్నం చేస్తున్న టైమ్ లో… హీరో షాహిద్ కపూర్‌ తన సరసన నటించేందుకు కాజల్ కు ఆఫర్ చేశాడట. కాజల్ కూడా ఎగిరి గంతేసిందట. ఈ క్రమంలో కాజల్ కు చెందిన లగ్జరీ కారును తన సొంత అవసరాల కోసం షాహిద్ ఫుల్లుగా వాడుకున్నాడట.అయితే చివరికి సినిమా తెరకెక్కుండా కథా చర్చల సమయంలోనే ప్రాజెక్టు ఆగిపోవడంతో… షాహిద్ సైడ్ అయిపోయాడట. చివరికి కాజల్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట. ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకొని ఆవేదన వ్యక్తం చేసిందట కాజల్.

Loading...

Leave a Reply

*