సూపర్ స్టార్ సినిమాపై సెన్సేషనల్ రూమర్

robo

రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 సినిమాకు సంబంధించి రోజుకో పుకారు హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెహ్మాన్ లాంటి సంగీత సంచలనాన్ని పెట్టుకొని మరీ, సినిమాలో కేవలం ఒకే ఒక్క పాటను ఉంచారనే పుకారు నిన్నటివరకు షికారు చేసింది. ఆడియో ఫంక్షన్ లో 6 పాటలు రిలీజ్ చేసి, సినిమాలో మాత్రం ఒక పాటే పెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ప్రచారం షురూ అయింది.

రజనీకాంత్ రోబో 2.0 సినిమాలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఒకటి రజనీకాంత్ అయితే, ఇంకోటి రోబో క్యారెక్టర్. అయితే తాజా సమాచారం ప్రకారం… రోబో 2.0లో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక పాత్రలో రజనీకాంత్ వసీ క్యారెక్టర్ లో ఉంటే.. మిగతా రెండు క్యారెక్టర్లలో రెండు రోబోలో ఉంటాయట. వీటిలో ఒకటి మంచి రోబో, ఇంకోటి చెడ్డ రోబో అని తెలుస్తోంది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి తళైవ ఫ్యాన్స్ ఆనందం ఆపుకోలేకపోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈనెల 20న ముంబయిలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా ట్రయిలర్ ను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 20న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*