ఈ న‌లుగురికి చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీ ఏం చెప్పారు..?

tollywood-stars

మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, బ‌న్ని.. తెలుగు సినిమా మార్కెట్‌ని, పొటెన్షియాలిటీని కొత్త లెవ‌ల్‌కి తీసుకుపోగ‌ల స‌మర్ధులు. వీరితో కంపేర్ చేస్తే ప‌వ‌న్ మార్కెట్ కాస్త‌ ఎక్కువ‌. కానీ, ఆయన త్వ‌ర‌లోనే రాజ‌కీయాలపై ఫోక‌స్ పెడ‌తానంటున్నాడు. దీంతో, ఆ న‌లుగురే టాలీవుడ్ ఫ్యూచ‌ర్ స్టార్స్‌గా క‌నిపిస్తున్నారు. ఇక‌, చిరంజీవి, బాల‌య్య‌, నాగ్‌, వెంకీ న‌టిస్తున్నా… రికార్డ్‌ల‌న‌న్నీ ఆ న‌లుగురే క్రియేట్ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ త‌ర్వాత చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీ.. తెలుగుసినిమా క‌మ‌ర్షియ‌ల్ స్టామినాని పెంచారు. అయితే, ఆ హీరోలు సౌత్‌లోని ఇత‌ర భాష‌ల‌లో ప‌ట్టు ద‌క్కించుకోలేక‌పోయారు. అప్ప‌టికి ఓవ‌ర్సీస్ మార్కెట్ కూడా లేక‌పోవ‌డంతో.. అక్క‌డ కూడా వారు స‌రిగ్గాపాగా వెయ్య‌లేక‌పోయారు.

ఆ సీనియ‌ర్ న‌లుగురు చెయ్య‌లేని ప‌నిని.. ఈ జూనియ‌ర్ న‌లుగురికి అప్పగించారంటున్నాయి టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు. సౌత్‌లోని ఇతర లాంగ్వేజెస్‌లో జెండా పాతాల‌ని, దీంతోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ తెలుగు సినిమా మార్కెట్‌ను అమాంతం రెయిజ్ చెయ్యాల‌ని వారికి త‌మ వార‌స‌త్వంగా అందిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. క‌ర్నాట‌క‌లో మ‌న హీరోల‌కి మంచి మార్కెట్ ఉంది. అయితే, త‌మిళ్‌, మ‌ల‌యాళంతోపాటు.. హిందీలోనూ టాలీవుడ్ స‌త్తా చాటాల‌ని వారికి సూచిస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఆ దిశ‌గా మ‌న హీరోలు త‌మ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌మిళ్‌లో పాగా వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. కోలీవుడ్‌లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు మ‌హేష్‌, బ‌న్ని. ఇటు, ఈ హీరోల డ‌బ్బింగ్ సినిమాలు హిందీ చానెల్స్‌కి భారీ రేటింగ్స్ వ‌స్తున్నాయి. ఇలా, ఆ న‌లుగురు ఇచ్చిన బాధ్య‌తల‌ను ఈ న‌లుగురు నెర‌వేరుస్తారా..?  లేదా? అనేది చూడాలి.

 

Loading...

Leave a Reply

*