ధృవ దారిలో శాతకర్ణి

untitled-18

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఏ క్షణానైనా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా.. హంగామా చేద్దామా అని నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్. కానీ అంతలోనే బిగ్ షాక్. శాతకర్ణి సినిమా ధృవ సినిమాను ఫాలో అవుతోందట. అవును… చెర్రీ చూపించిన మార్గంలోనే బాలయ్య నడుస్తున్నాడట. శాతకర్ణి సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ ఏమీ పెట్టకుండా నేరుగా మార్కెట్లోకి పాటల్ని రిలీజ్ చేయాలనకుుంటున్నారట.

నిజానికి శాతకర్ణి సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అంతకంటే ముందే ట్రయిలర్ నుఏకంగా వంద లొకేషన్లలో వంద థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇలా రెండు బిగ్ ఈవెంట్స్ ను రిలీజ్ కు ముందు చేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందట. అందుకే ఆడియో ఫంక్షన్ ను లిస్ట్ నుంచి లేపేశారని తెలుస్తోంది. నేరుగా ట్రయిలర్ లాంచ్ కార్యక్రమం పెట్టుకున్నారట.

అయితే మరికొందరు మాత్రం ఈ ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. డిసెంబర్ 16న మంచి ముహూర్తం ఉందని, ఆరోజున గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని, పెద్ద ఫంక్షన్ జరుగుతుందని అంటున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నట్టు ఆడియో ఫంక్షన్ మాట అటుంచితే.. ప్రీమియర్ షో మాత్రం జనవరి 3న పక్కా. తాజాగా ఈ డేట్ ఫిక్స్ అయింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోజు శాతకర్ణి సినిమా చూడబోతున్నారు.

Loading...

Leave a Reply

*