స‌రైనోడు కంటే జ‌నతా ఈ విష‌యంలో వీక్ అట‌..!

allu-vs-ntr

ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ జ‌న‌తా గ్యారేజ్‌. దాదాపు పుష్క‌ర‌కాలం త‌ర్వాత తార‌క్ నుంచి ఓ ఏడాది టాప్ మోస్ట్ హిట్ వ‌చ్చింది. ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ కావ‌డంతో.. 2016 బిగ్గెస్ట్ హిట్ స‌రైనోడు అనే భావించారంతా. రేసుగుర్రం త‌ర్వాత త‌మ అభిమాన హీరో మ‌రోసారి ఓ ఏడాది బిగ్గెస్ట్ డెలివ‌ర్ చేశాడ‌ని భావించారంతా. ఆ ఆశ‌ల‌కు తార‌క్ గండికొట్టాడు. అన్ని ఏరియాస్‌లో స‌రైనోడు రికార్డుల‌ను జ‌న‌తా క్రాస్ చేసింది. భారీ లాభాల‌ను ఆర్జించింది. ఈ రెండు సినిమాలకి మొదట ఫ్లాప్ టాక్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత తిరుగులేని స‌క్సెస్‌ను పొందాయి.

స‌రైనోడు రికార్డ్‌ల‌ను ఇటు టాలీవుడ్‌, సౌత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ దాటినా.. ఒక్క విష‌యంలో మాత్రం ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ వెన‌క‌బ‌డింద‌ట‌. అదేంటంటే.. స‌రైనోడు చాలా చోట్ల యాభై రోజులు ఆడింది. హైద‌రాబాద్‌లో కూడా ప‌దికిపైగా సినిమా హాళ్ల‌లో 50 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుంది. తార‌క్ జ‌నతా గ్యారేజ్ రీసెంట్‌గా 30 పూర్తి చేసుకుంది. నాలుగు వారాల్లోనూ క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం క్రియేట్ చేసిన తార‌క్ మూవీ నిన్న‌మొన్న‌టిదాకా మంచి క‌లెక్ష‌న్ల‌తోనూ ఆడింది.

ద‌స‌రా సీజ‌న్‌లోకి బోలెడు సినిమాలు ఎంట్రీ ఇస్తుండడంతో జ‌న‌తా వ‌సూళ్లు కాస్త త‌గ్గాయి. దీంతో, సినిమాను చాలా థియేట‌ర్ల‌లో ఎత్తేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో కేవ‌లం 6 సినిమా హాళ్ల‌లో మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఒకే ఒక్క మ‌ల్టిప్లెక్స్‌లో సినిమా ఆడుతోంది. ఇంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం ఇలా థియేట‌ర్ల నెంబ‌ర్ నెల రోజుల‌కే ప‌డిపోవ‌డంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. జ‌న‌తావి అన్నీ దొంగ లెక్క‌ల‌నే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తార‌క్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే స‌మాధాన‌మిస్తున్నారు సోష‌ల్ మీడియా సైట్స్‌లో.

Loading...

Leave a Reply

*