కసి తీర్చుకోవడానికి సిద్ధమౌతున్న మెగాస్టార్

1

నిజానికి చిరంజీవికి అయినా తెలుసో తెలీదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం ఓ రసవత్తరమైన డిస్కషన్ జరుగుతోంది. బాలయ్య-చిరంజీవి మధ్య ఈసారి సంక్రాంతి పోరు తప్పదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సమరం దశాబ్దాలుగా సాగుతున్నదనే విషయం కూడా తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది ఈ యుద్ధాలకు సంబంధించిన లెక్కలు తీశారు. ఇప్పటివరకు బాలయ్య-చిరంజీవి సంక్రాంతి బరిలో 18సార్లు తలపడ్డారట. అయితే 15 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత 19వ సారి తలపడబోతున్నారనేది తాజా న్యూస్.

ఇక్కడే ఓ చిన్న రివెంజ్ స్టోరీ కూడా ఉంది. చివరాఖరి పోరులో విజయం బాలయ్యను వరించింది. అవును… 2001 సంక్రాంతికి చిరంజీవి మృగరాజుతో వస్తే… బాలయ్య నరసింహనాయుడుగా వచ్చాడు. మృగరాజు ఫెయిల్ అయితే, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ చిరు-బాలయ్య బాక్సాఫీస్ బరిలో తలపడలేదు. మళ్లీ ఇన్నాళ్లకూ సంక్రాంతికి ఇద్దరి సినిమాలు సిద్ధమయ్యాయి.

మరీ ముఖ్యంగా బాలయ్యది వందో సినిమా అయితే, చిరంజీవిది 150వ సినిమా. సో.. ఈసారి మరోసారి చిరంజీవిపై బాలయ్య పైచేయి సాధించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు 2001 పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చిరు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. సంక్రాంతి బరిలో 19వ సారి తలపడబోతున్న చిరు-బాలయ్యలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Loading...

Leave a Reply

*